Monday, April 29, 2024

జ్ఞానవాపి మసీదులో రాత్రికి రాత్రే పూజలు పునః ప్రారంభం

- Advertisement -
- Advertisement -

వారణాసి : జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేయగానే రాత్రికి రాత్రి పూజలు పునః ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టీ తెలియజేశారు. మూడు దశాబ్దాలుగా ఇక్కడ పూజలు జరగడం లేదు. మసీదు భూగృహంలో విగ్రహాల ముందు పూజారి పూజలు చేయవచ్చని జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులు జారీ అయిన కొన్ని గంటలకే వ్యాస్‌జీ భూగృహం 31 ఏళ్ల తరువాత తెరవబడిందని ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే తెలియజేశారు. దక్షిణ సెల్లార్ బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తెరవడమైందన్నారు. కోర్టు ఉత్తర్వును తాను పాటించానని జిల్లా మెజిస్ట్రేట్ ఎస్. రాజలింగం తెలిపారు. సెల్లార్‌ను పరిశుభ్రం చేసిన తరువాత లక్ష్మీ, గణేశ్ దేవుళ్ల విగ్రహాలకు హారతి ఇవ్వడమైందని స్థానికులు కొందరు తెలిపారు.

బుధవారం రాత్రి 9.30 గంటలకు కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్ తమను పిలవగా వెళ్లి నంది విగ్రహం ముందునున్న బారికేడ్లను తొలగించామని జిల్లా అధికారులు తెలియజేశారు. ఈ తొందరపాటు చర్యపై సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ధ్వజమెత్తారు. న్యాయపరంగా ఎదురయ్యే చర్యలను అడ్డుకోడానికే బీజేపీ ఈ విధమైన తొందరపాటుకు పూనుకుందని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News