Wednesday, May 8, 2024

మత విశ్వాసాలపై హిందువులకు రాహుల్ భాష్యం అక్కర్లేదు

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విసుర్లు

న్యూఢిల్లీ: హిందువుల విశ్వాసాలను తప్పుదోవ పట్టించడం తనకు సులభసాధ్యమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భావిస్తున్నారని, కాని తమ మత విశ్వాసాలను ఎలా ఆచరించాలో భాష్యం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదని ప్రజలు భావిస్తున్నారని బిజెపి వ్యాఖ్యానించింది. బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని నలుమూలలకు చెందిన హిందువులకు అయోధ్య రామాలయం ఒక గొప్ప భావోద్వేగమైన అంశమని అన్నారు.

అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయ ప్రాణప్రతిష్టాపన మహోత్సవాన్ని బిజెపి కార్యక్రమంగా మార్చివేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ రాహుల్ గాంధీ ఊహా ప్రపంచంలో బతుకుతుంటారని, తాను యెప్పే ప్రతి విషయం వాస్తవమని నమ్మించడానికి ఆయన ప్రయత్నిస్తుంటారని చంద్రశేఖర్ చెప్పారు. ఈ సందర్భంగా కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రస్తావిస్తూ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుండగా రైతులు దీనస్థితిలో మగ్గుతున్నారని యన అన్నారు. 2022-అన్నారు.

23 వరకు గడచిన తొమ్మిదేళ్లలో 24.82 కోట్ల మంది ప్రజలు బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ అందచేసిన నివేదికను ఆయన ప్రస్తావిస్తూ ఇది ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన పేదల అనుకూల, సంక్షేమ పథకాల వల్లే సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. గరీబీ మఠావో వంటి శుష్క వాగ్దానాలతో పేద ప్రజలను కాంగ్రెస్ లప్పుదారి పట్టించిందని ఆయన ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అన్యాయాన్ని తిరగరాసిందంటూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పేదవారి జీవితాలతో ఆడుకుంటుందని, కాని మోడీ ప్రభుత్వం పేదల జీవితాలను పూర్తిగా మార్చివేసిందని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News