Friday, April 26, 2024

సైబరాబాద్‌లో రక్తదాన శిబిరం

- Advertisement -
- Advertisement -

CP VC Sajjanar donate Blood

రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి
తలసేమియా, క్యాన్సన్ రోగులు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్నారు
104 యూనిట్లు సేకరించాం
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్

మనతెలంగాణ, హైదరాబాద్ : తలసేమియాతో బాధపడుతున్న పిల్లలు, క్యాన్సర్ రోగులు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 104యూనిట్ల రక్తం సేకరించారు. పోలీసులతోపాటు సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ స్వయంగా రక్తదానం చేశారు. తెలంగాణలో 6,000మంది పిల్లలు తలసేమియాతో బాధపడుతున్నారని, వారికి రక్తం కావాల్సి ఉందని అన్నారు. తలసేమియా సికిల్ సెల్ సొసైటీ 1998 నుంచి పనిచేస్తోందని అన్నారు. తలసేమియా జనెటిక్ డిజార్డర్ అని అన్నారు. వారికి రెండు, మూడు వారాలకు ఒకసారి రక్తం మరిస్తేనే బతుకుతారని అన్నారు.

ఆస్పత్రులకు వెళ్లిన వారు అక్కడ ఉన్న బ్లడ్ బ్యాంక్‌లకు వెళ్లి రక్తం దానం చేయాలని కోరారు. రక్తదానంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. కోవిడ్ వచ్చిన వారు 14రోజుల తర్వాత రక్తం దానం చేయవచ్చని అన్నారు. 10,500మంది పోలీసులు రక్తదానం చేశారని, వాటిని 17బ్లడ్ బ్యాంక్‌లకు అందజేశామని తెలిపారు. వచ్చే వారం చిన్న చిన్న రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అపార్టుమెంట్లు, రిసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. సిఎఆర్‌లో పనిచేస్తున్న 104మంది పోలీసులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎడిసిపి వెంకట్‌రెడ్డి, ఎసిపిలు సంతోష్, బాలకృష్ణ రెడ్డి, హన్మంతరావు, ఇన్స్‌స్పెక్టర్లు మట్టయ్య, మట్టయ్య.వి, వెంకటస్వామి, విష్ణు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

CP VC Sajjanar donate Blood

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News