Tuesday, May 7, 2024

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చీఫ్‌గా పరేష్ రావల్..

- Advertisement -
- Advertisement -

Paresh Rawal as New National School of Drama Chief

న్యూఢిల్లీ: విలక్షణ నటుడు పరేష్ రావల్‌ను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్‌ఎస్‌డి) చీఫ్‌గా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నియమించారు. పరేష్ రావల్‌కు నూతన బాధ్యతలు కట్టబెట్టినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నిర్ధారించారు. పరేష్ నియామకం పట్ల ఆయనకు అభినందనలు తెలియజేసిన మంత్రి ఈ నియామకంతో కళాకారులు, విద్యార్థులకు మేలు జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా తన సినీ ప్రస్థానంలో పరేష్ జాతీయ ఫిల్మ్ అవార్డుతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలకుగాను 2014లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. సినిమాలతో పాటుగా నాటకరంగంలోను పరేష్ చురుకుగా ఉండేవారు. సినిమాలకన్నా నాటకాలనే తాను ఎక్కువగా ఇష్టపడతానని పరేష్ గతంలో పలు ఇంటర్వూలలో చెప్పుకొచ్చారు. కాగా బిజెపి మాజీ ఎంపి అయిన 65 ఏళ్ల రావల్‌ను నాలుగేళ్ల కాలానికి ఈ పదవిలో నియమించినట్లు సాంస్కృతిక వ్యవహారాల శాఖ సలహాదారు నితిన్ త్రిపాఠీ తెలిపారు.

Paresh Rawal as New National School of Drama Chief

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News