Monday, April 29, 2024

టి20 ర్యాంకింగ్స్: మలాన్‌కు టాప్ ర్యాంక్ ..

- Advertisement -
- Advertisement -

టి20 ర్యాంకింగ్స్ ప్రకటన.. మలాన్‌కు టాప్ ర్యాంక్

దుబాయి: అంతర్జాతీయ ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 సిరీస్‌లో నిలకడైన ఆటను కనబరచడం ద్వారా మలాన్ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మెరుపులు మెరిపించిన మలాన్ నాలుగు ర్యాంక్‌లను మెరుగు పరుచుకుని ఏకంగా టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సిరీస్‌లో మలాన్ 129 పరుగులు సాధించాడు. మలాన్ టి20లో అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. కాగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు టాప్ ర్యాంక్‌లో కొనసాగిన బాబర్ దీన్ని మలాన్‌కు కోల్పోయాడు. భారత స్టార్ లోకేశ్ రాహుల్ నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 9వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్, భారత్ వరుసగా రెండో, మూడో ర్యాంక్‌లో నిలిచాయి.

Dawid Malan gets top rank in ICC T20 Rankings 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News