Saturday, May 4, 2024

నేటి నుంచి పవన్‌కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు మూడు రోజులు కేటాయింపు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధలకు మద్దతుగా ఆ పార్టీ అధినేత సినీనటుడు పవన్‌కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. పవన్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం మూడు రోజులు కేటాయించారు. బిజేపి జనసేన పార్టీలు ఈ ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని పోటీ చేస్తున్నందున పవన్ రెండు పార్టీల అభ్యర్దులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. బుధవారం వరంగల్ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి రావు పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అదే విధంగా ఈ నెల 25న తాండూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్ధి శంకర్‌గౌడ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 26న కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్ధి ప్రేమ్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో ప్రధాని నరేంద్రమోడి పాల్గొనే ఎన్నికల సభల్లోకూడా పవన్ పాల్గొననున్నారు.

బిజేపి జనసేన నేతల ఉమ్మడి ప్రచారాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజేపి జనసేన పార్టీల నేతలు ఉమ్మడిగా పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులు ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా. బిజేపి అభ్యర్ధులు 111 నియోజకవర్గాల్లో పోటీ చేస్తునారు. రెండు పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని ఉమ్మడిగానే నిర్వహిస్తున్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ , తాండూర్ , కోదాడ నియోజకవర్గాల్లో జనసేన బిజేపి నేతలు ఉమ్మడిగా ఎన్నికల ప్రాచారల్లో పాల్గొన్నారు.కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన బిజేపి నేతలు పాదయాత్ర నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News