Wednesday, December 4, 2024

బిజెపికి రైతులే బుద్ధి చెప్పాలి: పెద్ది సుదర్శన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

MLA Peddi Sudharshan Reddy comments on BJP

 

కరీంనగర్: కమలాపూర్‌లో మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈటెల వ్యాఖ్యలకు సుదర్శన్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. ఈటెల విచ్చలవిడిగా మాట్లాడడం అప్రజాస్వామికమని, తన అవికేకానికి నిదర్శనమని మండిపడ్డారు. సిఎం కెసిఆర్‌ను విమర్శించడం ఈటెల రాజేందర్ అహంకారానికి నిదర్శనంగా మారిందన్నారు. దేశంలో రైతుకు మద్దతు ధర చెల్లించేది తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రైతు బాగుంటే సమాజం బాగుంటుందని నమ్మే వ్యక్తి సిఎం కెసిఆర్ అని, కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు ఆలోచన చేయాలని సూచించారు. రైతుల చైతన్య వంతులు కావాలని, బిజెపి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏ ముఖం పెట్టుకొని బిజెపి నేతలు హుజూరాబాద్‌లో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ఏడేళ్లలో రైతులను సిఎం కెసిఆర్ వివిధ పథకాల ద్వారా ఆదుకున్నారని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు సిఎం కెసిఆర్ ఢిల్లీకి వెళ్లారన్నారు. ఏడేళ్లలో ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి వెళ్లి తెలియజేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News