Friday, April 26, 2024

‘పెళ్లిసందD’ పాటల సందడి షురూ

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్ 28… దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు జీవితంలో విశిష్టమైన రోజు. ఎందుకంటే ఈ రోజున బాక్సాఫీస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘అడవి రాముడు’ రిలీజైన రోజు. అదే ఏప్రిల్ 28 ప్రపంచ చలన చిత్ర చరిత్రలో సంచలనం సృష్టించి బాక్సాఫీస్ రికార్డులకు కొత్త అర్థం చెప్పిన కె.రాఘవేంద్రరావు సమర్పణలో తన శిష్యుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి 2’ విడుదలైన రోజు. ఇలాంటి ఒక అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఏప్రిల్ 28న కె.రాఘవేంద్రరావు సారధ్యంలో రూపొందుతున్న ‘పెళ్లిసందD’ పాటల సందడి మొదలవుతోంది. 1996లో విడుదలై బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది నాటి ‘పెళ్లి సందడి’. అయితే ఇప్పుడు దర్శకేంద్రుడు రూపొందిస్తున్న ‘పెళ్లిసందD’ ఆ చిత్రానికి సీక్వెల్ కాదు. ఇది ఓ కొత్త కథ. నాటి ‘పెళ్లి సందడి’లో శ్రీకాంత్ హీరో అయితే నేటి ‘పెళ్లిసందD’లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో కావడం విశేషం. నాటి ‘పెళ్లి సందడి’కి మధురమైన పాటలను అందించిన కీరవాణి ఈ ‘పెళ్లిసందD’కి కూడా సంగీతాన్ని అందించడం మరో విశేషం. ఈ ఏప్రిల్ 28న రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ ‘పెళ్లిసందD’లోని ఓ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది.

PellisandaD first Song to Releasing on April 28

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News