Sunday, April 28, 2024

కరోనా కొనుగోళ్లు

- Advertisement -
- Advertisement -

purchase of Essentials

 

 

హైదరాబాద్: దేశవ్యాప్త జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం నాడు రాష్ట్రంలోని సూపర్ మార్కెట్‌లు, కూరగాయల మార్కెట్‌లకు, కిరాణా దుకాణాలకు జనాలు క్యూ కట్టడం కనిపించింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే విద్యాసంస్థలు బంద్ చేయడం, వీకెండ్ కావడంతో రాజధాని సగం ఖాళీ అయిపోయింది. అలాగే రోజు రోజుకు ప్రభుత్వాలు నియంత్రణ పెంచుతుండటంతో ప్రజలు ముందుగానే సరకులు కొని తెచ్చుకున్నారు. ఇక ఆదివారం జనతా కర్ఫూ ఉండటంతో మూడు రోజుల నుంచి వారం, నెలకు సరిపడా కూరగాయలు, బియ్యం, పిండి,ఉప్పు, నూనె, పాలు, పెరుగు కొనుగోలు చేశారు. ప్రధానంగా టిఫిన్ ఐటెమ్స్ కోసం అవసరమైనవి, స్నాక్స్ పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్లు విక్రయదారులు పేర్కొన్నారు.

సాధారణంగా జీతం వచ్చిన నెల తొలి వారంలోనే సరుకుల కోసం మార్కెట్లకు వెళుతుంటారు. ఇందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. జయశంకర్ వర్సిటీ అధ్యయనం ప్రకారం, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబం సగటున నెలకు రూ. 2,156 కిరాణం, నిత్యావసర సరకుల కోసం ఖర్చు పెడుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఇది రూ. 2,630గా ఉంది. ఇప్పుడు ఈ మొత్తానికి రెండింతలు, మూడింతల దాకా సరుకుల కోసం గడిచిన రెండు రోజుల్లో ఖర్చు చేసినట్లు సూపర్ మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే వినియోగదారులు సబ్బులు కూడా ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేశారు.

పెరిగిన కూరగాయల వినియోగం
కరోనా వైరస్ తీవ్రం అవుతుండటంతో ప్రజలందరూ నాన్ వెజ్ తినడం మానేశారు. అందులోనూ ముఖ్యంగా చికెన్ జోలికి వెళ్లడమే లేదు. దీంతో చికెన్ తింటే కరోనా రాదని.. ఫ్రీగా ఇంటింటికి కోడి మాంసాన్ని పంచుతున్నారు. ఈ భయంలో అందరూ కూరగాయల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వినియోగం భారీగా పెరిగింది. ఇదే అదునుగా భావించిన.. కూరగాయల దుకాణాదారులు ధరలను పెంచేశారు. ఒకప్పుడు ముక్క లేనిదే ముద్ద దిగదని అనే వారు ఇప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. ఇక సాధారణంగా వేసవిలో కూరగాయల దిగుబడి తగ్గిపోతుంది. ఇది కూడా ధరలు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు. కేవలం టమాటా, ఉల్లి పాయల ధరలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. మిగిలిన కూరగాయల ధరలు కిలో రూ.50ల పైననే పలుకుతున్నాయి. ఇలానే మరికొన్ని రోజులు కొనసాగితే.. కూరగాయల ధరలు కిలో రూ.100లు అయినా పెరగవచ్చునని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

People in the purchase of Essentials
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News