Friday, May 10, 2024

కొవిడ్ టీకా కోసం జనం అవస్థలు

- Advertisement -
- Advertisement -

నగరంలో అందుబాటులేని కోవాగ్జిన్, ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్న స్దానికులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా దొరకని వ్యాక్సిన్, మరో వారం రోజుల వరకు వేచి చూడాల్సిందేనంటున్న వైద్యశాఖ

People wait for Covid vaccine in Hyderabad

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగర ప్రజలు కరోనా వైరస్ నుంచి తట్టుకునేందుకు టీకా తీసుకునేందుకు వైద్యకేంద్రాలు చుట్టూ తిరుగుతున్నారు. గత వారం రోజుల నుంచి కొన్ని సెంటర్లలోనే వేస్తూ, పరిమితం గా రోజుకు 50 నుంచి 60మందికి మాత్రమే పంపిణీ చేసున్నట్లు జిల్లా వైద్యాదికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కోవాగ్జిన్ నిల్వలు లేవని, ఉన్నవాటిని ఆరో గ్య కార్యకర్తలు ఆరోగ్య కేంద్రాల వద్ద స్థానిక ప్రజలకు వేస్తున్నారు. ఇంకా చాలామంది ప్రజలు రెండో డోసు కోసం కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇప్పటికే సమయం పూర్తియిందని తీసుకోకుంటే ఆరోగ్య పరమైన సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతూ పలువురు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఖరీదు చేసి టీకా తీసుకుంటున్నారు. కానీ రెండు రో జుల నుంచి ప్రైవేటులో కూడా లభ్యం కావడంలేదు. దీంతో నగర ప్రజలు వ్యాక్సిన్ కోసం తిప్పలు పడుతున్నారు.

గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 63, 24, 530 మొదటి డోసు తీసుకోగా, సెకండ్ డో సు 10,15, 260 తీసుకున్నారు. ఇంకా సెకండ్ డో సు కోసం 52లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నేటివర కు మొదటి డోసు తీ సుకోని వారు చాలామం ది ఉన్న ట్లు ప్రధానంగా యు వత టీకా తీసుకునేందుకు నిర్ల క్షం చేస్తున్నట్లు, వైరస్ తమనేమి చేయదని గంభీరం గా మాట్లాడుతూ వ్యాక్సిన్ కోసం ముం దుకు రావడంలేదని స్థానిక ఆరోగ్య కార్యకర్తలు పేర్కొంటున్నారు. టీకాను ఎక్కువగా 30 నుంచి 45 సంవత్సరాల లోపు వారు అధిక సంఖ్యలో తీసుకుంటున్నారని, ప్రస్తు తం వ్యాక్సిన్ సరఫరా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తక్కువ మం దికి టీకా వేస్తున్న ట్లు చెబుతున్నారు.

అదే విధంగా ఇటీవల కురుస్తున్న వానల కు చాలామంది క రోనా వైరస్ లక్షణాలు కనిపిస్తుండటంతో బస్తీదవఖానలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చి చికిత్స తీసుకుం టూ పాజిటివ్ రాకుంటే వెంటనే వ్యాక్సిన్ తీసుకు నే ప్రయత్నంలో పడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ప్రస్తు తం బోనాల ఉత్సవాలు ఉండటంతో ప్రజలు గుంపులుగా సంచరించే అవకాశ ముందని వైద్యులు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నా రు. టీ కా నిల్వలు సరిపడా లేకపోవడంతో మరో వా రం వర కు ఆరోగ్య కేంద్రాల వద్దకు రావద్దని, వ్యాక్సిన్ రాగా నే ఆశవర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా ప్రజలకు తెలియజేస్తామని, అప్పటివరకు వేచిచూడాలని కోరుతున్నారు.

గాంధీ ఆసుపత్రికి తగ్గని కరోనా రోగులు

కొవిడ్ రోగులకు సేవలందించే గాంధీ ఆసుపత్రికి ఇంకా పాజిటివ్ వచ్చిన వారు రోజుకు 35మంది వరకు వైద్యం కోసం వస్తున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. అయిన నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, శస్త్రచికిత్సల కు సంబంధించిన వారు ఆరోగ్య పరమైన సిబ్బందులు పడుతున్నారని వారికోసం సాధారణ సేవలు అందుబాటులో తీసుకొస్తామంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News