Sunday, April 28, 2024

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol And Diesel Prices Hiked For Fifth Day

ముంబై: ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు మెల్లిగా పెరుగుతున్నాయి. దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో మారని ధరలు వరసగా ఐదో రోజుల నుంచి పెరుగుతున్నాయి. గురువారం లీటర్ పెట్రోల్, డీజిల్ పై 60పైసలు చొపున పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తెలిపాయి. దీంతో ఐదు రోజుల్లో పెట్రోల్ పై రూ. 2.74, డీజిల్ పై రూ.2.83 మేరకు పెరిగాయి.

ఢిల్లీలో పెట్రోలు రూ. 74. డీజిల్ రూ. 72.22కు చేరుకోగా.. ముంబైలో పెట్రోల్ రూ. 80.98. డీజిల్  రూ. 70.92గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ. 77.96. డీజిల్ రూ.70.64కు పెరుగగా… బెంగళూరులో పెట్రోల్ రూ. 76.39. డీజిల్ రూ. 68.66కు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ.76.82. డీజిల్ రూ. 70.59గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ రూ. 77.36. డీజిల్ రూ. 71.18కు పెరిగింది. పెట్రోల్, డీజిల్ పెంచడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Petrol And Diesel Prices Hiked For Fifth Day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News