Sunday, April 28, 2024

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు… 16 రోజుల్లో రూ.8లు పెంపు…

- Advertisement -
- Advertisement -

Petrol-Diesel Rates Raised by central Govt

 

ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత 16 రోజులలో ఎనిమిది రూపాయలు పెంచారు. 16వ రోజూ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 58 పైసలు చొప్పున పెంచుతూ దేశీయ చమరు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 2017 కు ముందు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను 15 రోజులకు ఒకసారి పెంచే వారు. కేంద్ర ప్రభుత్వంలో 2017లో ఈ విధానాన్ని రద్దు చేసింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు పెట్రో ధరలు హెచ్చు, తగ్గింపులు చేసుకునే చమురు కంపెనీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో లాక్‌డౌన్ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు పనులు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ల జేబును చమురు కంపెనీలు గుళ్ల చేస్తున్నాయి.

నగరాలు పెట్రోల్ డీజిల్
ఢిల్లీ 79.56 78.85
కోల్ కతా 81.27 74.14
ముంబయి 86.36 77.24
చెన్నై 82.87 76.30
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News