Sunday, April 28, 2024

వారి పరిస్థితి దయనీయం

- Advertisement -
- Advertisement -

harbajansingh

 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి నివారణకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడం మంచిదే అయినా ఇది విధించే ముందు పేద ప్రజల పరిస్థితి ఆలోచిస్తే బాగుండేదని భారత స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఒక్కసారిగా దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది వలస కూలీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తినడానికి తిండి లేకుండా, ఉండేందుకు నీడ లేక వారు పడుతున్న బాధలు తనను ఎంతో ఆవేదనకు గురి చేశాయన్నాడు. కరోనాపై పోరాటం చేసేందుకు లాక్‌డౌన్ విధించడాన్ని తాను తప్పుపట్టడం లేదని, అయితే ఇది విధించే ముందు పేద ప్రజల సహాయం కోసం తగు జాగ్రత్తులు తీసుకొని ఉండాల్సిందన్నాడు. ఇక, ఈ మహమ్మరిపై పోరాటానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నాడు.

 

Plight of migrant laborers is extremely pathetic
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News