Friday, May 3, 2024

ఫిబ్రవరిలో అయోధ్యకు వెళ్లకండి

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ పిలుపు
జనం రద్దీపై కేబినెట్‌లో ప్రస్తావన
ప్రజలకు అసౌకర్యం కల్గించవద్దని సూచనలు

న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఇటీవలే ప్రాణప్రతిష్ట జరిగిన రామాలయానికి భారీ సంఖ్యలో భక్తులు, యాత్రికులు తరలివస్తున్నారు. దీనితో రద్దీని నియంత్రించేందు కు చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని అయోధ్య స్థానిక అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమ మంత్రివర్గ సహచరులకు ప్రధాని నుంచి సంబంధిత విషయంలో బుధవారం సూచనలు వెలువడ్డాయి. మంత్రులు తమ విఐపి, వివిఐపి హోదాలలో రద్దీ దశలో అయోధ్యకు వెళ్లితే తలెత్తే పరిస్థితిని దృష్టిలోతీసుకుని ప్రధాని మోడీ నుంచి ఈ విషయంలో ఆదేశాలు వెలువడినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి వదిలేసి, మంత్రులు అయోధ్యకు మార్చి నెలలో వెళ్లవచ్చునని, అప్పటివర కూ తమ పర్యటన వాయిదా వేసుకోవాలని ప్రధాని కోరినట్లు వెల్లడించారు. బుధవారం కేంద్ర కేబినెట్ సమావే శం జరిగింది. ఈ దశలో అయోధ్యలో రామాలయంలో ప్రాణప్రతిష్ట, దీనిపై ప్రజాస్పందన గురించి మంత్రులను ప్రధాని ప్రశ్నించినట్లు వెల్లడైంది. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటోందని, దూర ప్రాంతాల నుంచి బాలరాముడిని చూసేందుకు జనం తరలివస్తున్నారని, విశేష స్పం దన ఉందని మంత్రులు ప్రధానికి వివరించినట్లు తెలిసింది. 22న రామాలయ ప్రాణప్రతిష్ట ఘట్టం ఘనంగా జరిగింది. ప్రధాన ఘట్టానికి ఆహ్వానితులుగా తరలివచ్చిన విశిష్టులు ఆ తరువాత ప్రత్యేకంగా బాలరాముడిని సందర్శించుకున్నారు. మరుసటి రోజు మంగళవారం నుంచి దర్శనం సార్వత్రికం అయింది.

తొలిరోజునే దాదాపు ఐదులక్షల మంది వరకూ దర్శనం చేసుకున్నారు. ఈ సంఖ్య ఈ వారాంతంలో మరింత పెరుగుతుందని, ఫిబ్రవరి అంతా కూడా ఇదే విధంగా ఉంటుందని అధికారు లు అంచనా వేశారు. మంళవారం తెల్లవారుజామున మూడు గంటలకు దర్శనానికి భక్తులు బారులు తీరారు. కాగా జనం కిక్కిరిసిన దశలో కొద్ది సేపు దర్శనం నిలిపివేయాల్సి వచ్చింది. ఆలయం ప్రాంగణం, అయోధ్యలో పలు ప్రాంతాలలో జనం కిక్కిరిసి ఉన్నారు. దీనితో పరిస్థితిని సమీక్షించుకుని అధికారులు రోజంతా అయోధ్యకు వచ్చే వాహనాలను శివార్లకు చాలా దూరంలోనే నిలిపివేశారు. పరిస్థితిని సమీక్షించిన తరువాతనే ఈ వాహనాల ను అయోధ్యలోకి పంపించేందుకు వీలుంటుందని తెలిపారు. నెలరోజుల పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు ఎవరూ కూడా దర్శనానికి రాకుండా ఉండ టం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానికి తెలియచేయడంతో, దీనికి అనుగుణంగానే ప్రధాని ఇప్పుడు మంత్రులకు దీనిపై తగు సలహాలు వెలువరించినట్లు వెల్లడైంది.

మైళ్లకొద్దీ దూరం నిలిచిన బస్సులు
అయోధ్యలో రాముడి దర్శనానికి ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ప్రైవేట్ వాహనాలలో లక్షలాది మంది అయోధ్యకు రావడంతో ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. పరిస్థితిని గమనించి ఉన్నత స్థాయి సమీక్ష తరువాత అధికారులు లక్నో ఇతర ప్రాంతాల నుంచి బస్సులు ఇతర వాహనాలను నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలూ చేపట్టినట్లు అయోధ్య ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బాలరాముడి దర్శనానికి ఎవరూ తొందరపడవద్దని, నెమ్మదిగా రావచ్చునని, ప్రత్యేకించి వృద్ధులు, దివ్యాంగులు వచ్చే రెండు మూడు వారాల వరకూ అయోధ్య సందర్శనానికి రాకుండా ఉంటే బాగుంటుందని సూచించారు.

రెండోరోజు మూడు లక్షల మందికి భాగ్యం
అయోధ్య/లక్నో: అయోధ్యలో కొత్తగా ఆవిష్కరించిన రామాలయానికి లక్షలాది మంది తరలివస్తున్నారు. బుధవారం ఉదయం చలిగాలులు ముసురుతున్నా లెక్క చే యకుండా వెచ్చని దుస్తులు ధరించి రామదర్శనం కోసం వేలాది మంది బారులు తీరారు. మధ్యాహ్నం కాగానే భక్తుల సంఖ్య మూడు లక్షలు దాటింది. అత్యంత భద్రత ఏర్పాట్ల మధ్య భక్తులు రామ్‌లల్లాకు భక్తిశ్రద్ధలతో మొ క్కులు సమర్పించుకున్నారు. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ కా గానే మంగళవారం ప్రజల దర్శనార్ధం తలుపులు తెరిచా రు. ఒక్క రోజునే ఐదు లక్షల మంది విచ్చేశారు.

జన ప్రవాహం అధికం కావడంతో రద్దీని అదుపు చేయడానికి, దర్శనం సులువుగా లభించడానికి వీలుగా తగిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులతో బుధవారం లక్నోలో సమీక్ష జరిపారు. విఐపిలు, వివిధ ప్రముఖులు ముందుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులకు లేదా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు తెలియజేసి తమ షెడ్యూల్ ఖరారు చేసుకోవాలని సూ చించారు. అయోధ్యకు అదనంగా వచ్చే బస్సులను ఆపాలని, భక్తులకు భద్రత, వెసులుబాటు కల్పించవలసిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. భారీ సంఖ్యలో వచ్చిన వారిని గుర్తించిన ఒకచోట ఉంచి, అక్కడ నుంచి క్రమంగా దర్శనానికి పంపాలని సూచించారు.

యాత్రికులు రామపథ్, ధర్మపథ్, జన్మభూమి పథ్, వద్ద బారులు తీరి నిలుచోవాలని, క్రమంగా వారిని ఆలయంలోకి దర్శనానికి పంపిస్తారని సిఎం సూచించారు. ఆ ప్రాంతాల్లో క్యూలో వయోవృద్ధులు, మహిళలు, చిన్నారులను ప్రత్యేకంగా గుర్తించడమౌతుందని, వృద్ధులకు, ది వ్యాంగుకలకు వీల్‌చైర్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సంప్రదాయాలకు అనుగుణంగా ప్రధాన రహదారుల్లో తక్కువ శబ్దంతో రామభజనలు వినిపించడమౌతుందని తెలిపారు. భద్రతా సిబ్బంది ప్రవర్తన గౌరవ ప్రదంగా ఉండాలన్నారు. వివిధ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని, చలికి తట్టుకోడానికి అక్కడక్కడ భోగీ మంటలు, జనపనార చాపలు ఏర్పాటు చేయాలన్నారు. రిపబ్లిక్ డే నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం కల్పించరాదని, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, ద్వేషపూరిత విధానాలకు ప్రయత్నించినా కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. ఏ ఒక్కరి మతపరమైన అభిప్రాయాలకు, ఆచారాలకు భంగం కలగరాదని, గౌరవించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News