Tuesday, May 7, 2024

మోడీ వైద్య ఖర్చులు ఆయనే భరించుకున్నారు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచంలోని అనేక మంది నాయకులు అనుసరిస్తున్నారు. ఆయన ఈ మధ్య అనేక జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు తెగ తిరిగారు. అయినప్పటికీ ఆయన ఎన్నడూ తన వైద్య ఖర్చులను ప్రభుత్వంపై వేయలేదు. తానే ఆ ఖర్చులే భరించారు. పూణెకు చెందిన ఆర్‌టిఐ కార్యకర్త ప్రఫుల్ సర్దా పెట్టుకున్న దరఖాస్తుపై ప్రధాని కార్యాలయం ఈ విషయాన్ని తెలిపింది. సాధారణంగా పార్లమెంటు సభ్యులకు అనేక సౌఖర్యాలున్నాయి. మోడీ దేశానికి ప్రధాని అయినప్పటికీ ఆయన తన వైద్య ఖర్చులు తానే భరించుకోవడం ఇక్కడ గమనార్హం. ఆయన తన వైద్య ఖర్చులకు ఒక్క రూపాయి భారం కూడా ప్రభుత్వంపై వేశాడు.

దేశంలో కానీ, విదేశంలో కానీ ‘2014 నుంచి నేటి వరకు ప్రధాని ఎలాంటి వైద్య ఖర్చు ప్రభుత్వంపై వేయలేదు’ అని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. ‘మోడీ 135 కోట్ల మంది దేశ ప్రజలకు తనలా ఫిట్‌గా ఉండమని సందేశం ఇచ్చారు’ అని కూడా పేర్కొంది. ‘ప్రజలు చెల్లించే పన్ను డబ్బులను తన స్వంతానికి ప్రధాని మోడీ వినియోగించుకోలేదని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇదే మార్గాన్ని ఎంపీలు, ఎంఎల్‌ఏలు కూడా అనుసరించాలి. ఎవరి వైద్య ఖర్చులు వారే భరించాలి’ అని ఆర్‌టిఐ యాక్టివిస్ట్ ఫ్రఫుల్ సర్దా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News