Friday, May 10, 2024

ఈజిప్టు మత గురువుతో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

కైరో : భారత ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఈజిప్టు మత పెద్ద షాకీ ఇబ్రహి అబ్దెల్ కరీం ఆలంతో సమావేశమై సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడం, తీవ్ర వాదాన్ని నిరోధించడంపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈజిప్టులో రెండు రోజుల పర్యటన సందర్భంగా మోడీ ఈజిప్టు మత పెద్దను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దార్ అల్‌ఇఫ్తా వద్ద ఐటిలో ఈజిప్టు సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌ను నెలకొల్పడమౌతుందని తెలియజేశారు. భారత్ ఈజిప్టు దేశాల మధ్య బలంగా ఉన్న సాంస్కృతిక, ప్రజల సంబంధాలపై చర్చించారని, సామాజిక సామరస్యం, తీవ్ర వాద నిరోధంపై కూడా చర్చలు జరిగాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. సమన్వయం, బహుళత్వ సాధనలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని మత పెద్ద అభినందించారని చెప్పారు.

ఢిల్లీలో జరిగిన సూఫీ సదస్సుల్లో ఒక సదస్సులో మోడీని తాను కలుసుకోగలిగానని, ఈ రెండు సమావేశాల మధ్య భారత్‌లో గొప్ప అభివృద్ది కనిపించిందని మత పెద్ద షాకీ ఇబ్రహి అబ్దెల్ కరీం ఆలం తెలిపారు. ఈజిప్టు, భారత్ దేశాల మధ్య మతపరమైన స్థాయిలో పటిష్టమైన సహకారం ఉంటోందని, దీన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. భారత సాంస్కృతిక సంబంధాల మండలి ఆహ్వానంపై ఆయన గత నెల భారత్‌ను సందర్శించారు. ప్రపంచంలో ఎదురౌతున్న సవాళ్ల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సహకారం, సయోధ్య అవసరమని ప్రధాని మోడీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ప్రకటనలు గుప్పించడాన్ని ఉదహరిస్తూ అలాంటి చర్చలు స్వాగతించ దగినవే అయిప్పటికీ, ఆ ఆకాంక్షలు సుస్థిర సంబంధాలుగా పరస్పరం అభివృద్ధి చెందడానికి ఆచరణాత్మక మైన అడుగులు ముందుకు పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News