Saturday, April 20, 2024

ఏడేళ్ల తర్వాత జాతీయ క్రీడలు..

- Advertisement -
- Advertisement -

PM Modi Opens 36th National Games in Gujarat

అహ్మదాబాద్: ప్రతిష్టాత్మకమైన 36వ జాతీయ క్రీడలకు గురువారం తెరలేచింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడలు జరగడం ఇదే తొలిసారి. చివరి సారిగా 2015లో కేరళ వేదికగా ఈ పోటీలను నిర్వహించారు. ఈసారి జాతీయ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యం ఇస్తోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావనగర్ నగరాల్లో ఈ పోటీలను జరుగనున్నాయి. ఇక సైక్లింగ్ పోటీలు మాత్రం రాజధాని ఢిల్లీలో జరుగుతాయి. ఈసారి జాతీయ క్రీడల్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు ఏడు వేల మంది క్రీడాకారులు పతకాల కోసం పోటీ పడనున్నారు. కాగా, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం జాతీయ క్రీడలను ప్రారంభించారు. ఆరంభోత్సవ కార్యక్రమంలో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, డబుల్ ఒలింపిక్ మెడల్ విజేత పి.వి.సింధు, స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తదితరులు పాల్గొన్నారు.

PM Modi Opens 36th National Games in Gujarat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News