Tuesday, May 7, 2024

ఆర్థిక పునరుద్ధరణ ఎలా?

- Advertisement -
- Advertisement -

మంత్రులు అధికారులతో ప్రధాని సమీక్ష

పెట్టుబడుల వ్యూహాలే కీలకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారు. పెట్టుబడులపై సమీక్షించారు. గురువారం ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం గురించి వారితో మాట్లాడారు. ఈ కీలక సమావేశంలో వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. లాక్‌డౌన్‌తో స్తంభించిన మౌలిక నిర్మాణ వ్యవస్థ, పలు రకాల పరిశ్రమలు, వివిధ పారిశ్రామికవాడలలో పరిస్థితి గురించి ఈ సందర్భంగా విస్తృతస్థాయి సమీక్ష జరిగింది.

తిరిగి పెట్టుబడులను రప్పించడం, పారిశ్రామిక వాతావరణం నెలకొనేలా చేయడం ముఖ్యమని, ఇందుకు రాష్ట్రాలు సహకరించాలని సూచనలు వెలువరించారు. విదేశీ పెట్టుబడులు, స్థానిక స్థాయిలలో పరిశ్రమలు ఇతర సంస్ధలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే వారి పెట్టుబడులకు సరైన సహకారం అందించాల్సి ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. అవసరమైన అనుమతులను వెంటనే ఇప్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ సమయంలో కేవలం దుకాణాలలో నిత్యావసర సరుకులు విక్రయించడం జరుగుతోంది. ఇతరత్రా ఉత్పత్తి కార్యకలాపాలకు విఘాతం ఏర్పడింది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు మొదలుకుని హీరో మోటో కార్ప్ లిమిటెడ్‌వంటి పెద్ద బ్రాండ్స్ సంస్థల వరకూ సాయానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. వేతన సబ్సిడీలు, పన్నుల వాయిదా, యుటిలిటి చెల్లింపులపై మారిటోరియంలు కోరుతున్నాయి. గత నెలలో ఆర్థిక మంత్రి సీతారామన్ పేదలు, వలసకూలీలు, ఆపన్నులకు సాయం కోసం రూ 1.75లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇప్పటికిప్పుడు పారిశ్రామికవర్గాలకు రాయితీలు ఇతరత్రాసాయానికి కేంద్రం తక్షణ ప్రకటన ఏదీ చేయబోదని కొందరు మంత్రులు ఇటీవలే పరోక్షంగా తెలిపారు. కరోనా వైరస్ ఎంతటి నష్టం కల్గిస్తుందో ఇప్పటికిప్పుడు చెప్పలేమని. ఈ దశలో ఇప్పటికే నిధుల కొరతతో ఉన్న కేంద్రం ఎటువంటి సహాయానికి ముందుకు రాకపోవచ్చునని సూచనప్రాయంగా తెలిపారు.

PM Modi Review Meeting with Ministers on Economy

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News