Tuesday, May 14, 2024

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi to inaugurate Purvanchal Expressway

సుల్తాన్‌పూర్(యుపి): ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం భారతీయ వైమానిక దళానికి చెందిన సి-130 హెర్కులస్ విమానంలో హైవే ఎయిర్‌స్ట్రిప్‌పై దిగి 341 కిలోమీటర్ల పొడవైన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. ఎయిర్‌స్ట్రిప్ వద్ద ప్రధాని మోడీకి ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు.అత్యవసర పరిస్థితులలో యుద్ధ విమానం దిగడానికి వీలుగా ఎక్స్‌ప్రెస్‌వేపైన 3.2 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌స్ట్రిప్‌ను నిర్మించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోను ఘాజీపూర్‌తో కలిపే 341 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేను రూ. 22,500 కోట్ల వ్యయంతో నిర్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News