Sunday, April 28, 2024

సిఎం కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ, కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

About CM KCR Biography

 

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. సిఎం కెసిఆర్ కు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్‌ సహా పలువురు మంత్రులు శుభాకాంక్షలు చెప్పారు. కెసిఆర్‌ సారథ్యంలో దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల నెరవేరిందని, భావితరాల బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.  కెసిఆర్‌ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని సత్యవతి రాథోడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News