Saturday, May 18, 2024

హాలీవుడ్ మూవీని తలపించేలా…

- Advertisement -
- Advertisement -

Poison Movie

వినూత్న రీతిలో జరిగిన ‘పాయిజన్’ మూవీ క్విజ్ కాంపిటీషన్‌లో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు ఫిల్మ్‌మేకర్స్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సి.కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. హీరో రమణకు మంచి భవిష్యత్తు ఉంది. డైరెక్టర్ రవిచంద్రన్ ఈ సినిమాతో తన ప్రతిభను చాటాడు”అని అన్నారు. చిత్ర దర్శకుడు రవిచంద్రన్ మాట్లాడుతూ “ సినిమా ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు. హీరో రమణ ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు పుప్పాల రమేష్, లయన్ సాయివెంకట్, హీరో రమణ, చిత్ర నిర్మాత శిల్పిక.కె పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News