Saturday, May 4, 2024

పోలవరం ఎత్తుపై గందరగోళం

- Advertisement -
- Advertisement -

45.72 మీటర్లని సోమవారం రాజ్యసభలో మంత్రి సమాధానం గతంలో లోక్‌సభలో
41.15 మీటర్లేనని వెల్లడి అయోమయంలో గోదావరి పరీవాహక రాష్ట్రాలు

పార్లమెంట్ సాక్షిగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసిన కేంద్రం

మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం విభిన్నమైన ప్రకటనలు చేస్తూ గోదావరి నది పరీవాహకంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలను గందరగోళంలోకి నెట్టివేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయమై లోక్ సభలో ఒక విధంగా, రాజ్యసభలో మరో విధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో ఏది నమ్మాలో, ఏది నిజమో అన్న సందేహాలు ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రజలనుంచి వ్యక్తమవుతున్నాయి. గోదావరి నదీ జలాల వివాద పరిష్కారాల ట్రి బ్యునల్ 1980లో ప్రకటించిన అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి నీటినిలువ సామర్థం (ఎఫ్‌ఆర్‌ఎల్) ఎత్తు 45.72మీటర్లు అని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ సోమవారం రాజ్యసభలో లిఖిత పూర్వకంగా వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఎంతో తెలపాలని రాజ్యసభ సభ్యుడు రవీంద్ర కుమార్ అడిగిన ప్ర శ్నకు మంత్రి లిఖితపూర్వకంగా బదులిచ్చారు. పోలవరం ఎత్తును తగ్గిస్తూన్నట్టుగా ఎపి ప్రభుత్వం నుంచి తమకు ప్రతిపాదన ఏదీ రాలేదని వెల్లడించారు. అంతకుముందు ఇదే సెషన్స్‌లో పోలవరం ఎత్తుపై వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎంపి సత్యవతి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బదులిస్తూ పోలవరం ప్రాజెక్టు మొదటి దశలో భాగం గా ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకే పరిమితం అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ఎత్తుపై ఉభయ సభల్లో కేంద్ర మంత్రుల చేత భిన్నమైన ప్రకటనలు చేయించడం గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. తె లంగాణ , ఆంధ్రప్రదేశ్ , చత్తీస్‌గడ్ , ఒడిశా రాష్ట్రాలతో ముడిపడి ఉన్న పో లవరం ప్రాజెక్టు సమస్యలో కేంద్రప్రభుత్వం చేసిన ఈ విధమైన ప్రకటనల్లో దేన్ని నమ్మాలో , ఏది నిజమో అన్న సందేహాలు పుటుకొస్తున్నాయంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని చూస్తున్నారని , దీన్ని సహించేది లేదని ఇప్పటికే ఎపిలో ప్రజాసంఘాలు కేంద్రానికి హెచ్చరికలు చేశా యి. పోలవరం ప్రాజెక్టులో ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పడు కేంద్రం పోలవరం ఎత్తుపై మరింత స్పష్టత ఇచ్చేలా ప్రకటన జారీ చేయాలని గోదావరి నది పరివాహక నిర్వాసిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పోలవరం తుది నివేదికపై సుప్రీంకు కేంద్రం లేఖ

పోలవరం ముంపునకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సోమవారం సు ప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. పిటిషన్ల విచారణపై వాయిదా కోరుతూ వినతిపత్రం సమర్పించింది. పోలవరం ప్రాజెక్టుముంపు సమస్యపై దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. పోలవరం ప్రాజెక్టువల్ల వరద ముంపు తలెత్తుతున్నందున ఈ సమస్యకు పరిష్కార మార్గాలు చూపాలని తెలంగాణ, చత్తిగఢ్ , ఒడిశా రాష్టాల ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటీషన్ల ్ల విచారణ నేపద్యంలో కేంద్రం సుప్రీంకోర్టుకు ఈ లేఖ రాసింది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖమంత్రి సమావేశం ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉందని , ఈ పరిస్థితుల దృష్టా మరో మూడు నెలల పాటు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని , తుది నివేదిక అందించడానికి మరికొంత సమయం పడుతుందని కేంద్రం తెలిపింది. 2022 సెప్టెంబర్ 6న సుప్రీం ఇచ్చిన ఆదేశాల ప్రకారం గోదావరి నదీ పరివాహకంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే కల్పించుకుని అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇందుకు మరికొంత సమయం కావాలని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థ్ధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News