Monday, April 29, 2024

మాస్కులేకుంటే జరిమానా…

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జివోను మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమలు చేసేందుకు సిపిలు సిద్ధమవుతున్నారు. ఇందుకు వారు సిసిటివి నిఘాలో లివరేజింగ్ కంప్యూటర్ విజన్, డీప్‌లెర్నింగ్ టెక్నిక్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా బహిరంగా ప్రదేశాల్లో మాస్కుల లేకుండా తిరిగే వారిని కనిపెట్టి వారిపై చర్యలు తీసుకోనుంది. ఇలాంటి పద్ధతి పాటించడం దేశంలోనే మొదటి సారి. మాస్కు ధరించకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించి రూ.1,000 జరిమానా విధించనున్నారు.

ఈ విధంగా ప్రతిసారి పట్టుబడితే వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కరోనా వ్యాపించకుండా తెలంగాణ ప్రభుత్వం ఇంటి నుంచి బయటికి వచ్చిన వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని లేకుంటే జరిమానా విధిస్తామని గురువారం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో అమలు చేయనున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రజల అవగాహన కోసం పోస్టర్‌ను విడుదల చేశారు. మాస్కు ధరించకుండా బయటికి వస్తే రూ.1,000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News