Sunday, April 28, 2024

పోలీస్ ఫ్లాగ్ డే – ఫోటో, వ్యాస రచన పోటీల ఫలితాల ప్రకటన

- Advertisement -
- Advertisement -

Police Flag Day Photo, Essay Writing Contest Results Announcement

 

విజేతలకు డిజిపి అభినందనలు

మనతెలంగాణ/హైదరాబాద్ : పోలీస్ ఫ్లాగ్ డే – పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పోలీసు శాఖ నిర్వహించిన ఫోటోగ్రఫీ, వ్యాసరచన పోటీల ఫలితాలలో విజేతలను శుక్రవారం నాడు డిజిపి కార్యాలయం ప్రకటించింది. విపత్తుల సమయం, సామాజిక సేవలో పోలీసులు అన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలలో మొదటి బహుమతి బి. సురేందర్ కుమార్ కు దక్కింది. ద్వితీయ బహుమతి ది హన్స్ ఇండియా వార్తా పత్రికకు చెందిన ఆదుల కృష్ణ , తృతీయ బహుమతి ఫోటో జర్నలిస్టు సతీష్ లాల్ అందేకర్ కు లభించింది. అలాగే ఛాయాచిత్ర పోటీలలో విజేతల ఫోటోలను డిజిపి తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి అభినందనలు తెలిపారు.

అదేవిధంగా కోవిద్ – 19 మహమ్మారి సందర్బంగా పోలీసులకు ఎదురైన సవాళ్లు అన్న అంశంపై ఎఆర్‌ఎస్‌ఐ, ఎఎస్‌ఐ లతోపాటు క్రింది స్థాయి ర్యాంకు అధికారులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రధమ బహుమతి సంగారెడ్డి జిల్లా సదాశిపేట మహిళా కానిస్టేబుల్ పి అరుణ కుమారి, ద్వితీయ బహుమతి ఆదిలాబాద్ జిల్లా ఎఆర్ కానిస్టేబుల్ కృష్ణ చైతన్య, తృతీయ బహుమతి నల్గొండ జిల్లా అన్నెపర్తి 12 వ బెటాలియన్ కానిస్టేబుల్ వెంకన్నలు దక్కించుకున్నారు. అలాగే కోవిద్ -19 మహమ్మారి సందర్బంగా పోలీసింగ్ లో సరికొత్త ఇన్నోవేషన్లు అంశం పై పోలీసు అధికారులకు నిర్వహించిన వ్యాస రచన పోటీలలోప్రధమ బహుమతి నల్గొండ సైబర్ ఐటిసెల్ పనిచేస్తున్న మౌనిక, ద్వితీయ బహుమతి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఇన్స్పెక్టర్ రాజు,తృతీయ బహుమతి వరంగల్ 5 వ బెటాలియన్ కార్తిక్‌లు విజేతలుగా నిలవడంతో వారిని డిజిపి డాక్టర్ ఎం. మహేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News