Monday, April 29, 2024

త్యాగాల నుండే గొప్ప విజయాలు!

- Advertisement -
- Advertisement -

ఎంఎస్ భాటియాను నేటి పోలీసులు స్మరించుకోవాలి
దేశంలోనే ఉత్తమ పోలీసింగ్ తెలంగాణలో అమలు: డిజిపి అంజనీ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : త్యాగాల నుండే గొప్ప విజయాలు లభిస్తాయని తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ పేర్కొన్నారు. పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహల్ స్టేడియంలో శనివారం నిర్వహించిన పోలీసు ఫ్లాగ్ డే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. కానిస్టేబుల్ అధికారి నుండి పోలీస్ ఉన్నతాధికారి వరకు ప్రజల రక్షణకై నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమై ఉంటారని, పౌర రక్షణ విధుల్లో ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 189 మంది పోలీసులు అమరులయ్యారని వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో పోలీస్ శిక్షణ ద్వారా విశేష సేవలందించి ఇటీవల దివంగతులైన ఎం.ఎస్. భాటియా సేవలను గుర్తు చేస్తూ, దాదాపు 30 ఐ.పి.ఎస్ బ్యాసిలకు, అనేక ఎస్.ఐ బ్యాచిలకు శిక్షణ నివ్వడం ద్వారా సుశిక్షితులైన పోలీస్ అధికారులను తయారుచేశారని వారి సేవలను గుర్తు చేశారు. దేశంలోనే ఉత్తమ పోలీసింగ్ అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణా నిలిచిందని, ఇందుకు ఉదాహరణ షీ టీమ్ లు, భరోసా కేంద్రాల నిర్వహణ, పాస్ పోర్ట్ క్లియరెన్సులు, సిసిటివి ప్రాజెక్టు నిర్వహణ లను ప్రస్తావించారు. రాష్ట్రంలో మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో షీ-టీమ్, భరోసా కేంద్రాల నిర్వహణపై సుప్రీం కోర్టు కూడా ప్రశంచిందని తెలిపారు. లాక్ డౌన్ లో ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ పౌరుల రక్షణకై పోలీసులు విధులు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.

పోలీస్ పరేడ్ అనంతరం డీజీపీతోపాటు పలువురు రిటైర్డ్ డిజిపిలు, సీనియర్ పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, అమర పోలీసుల కుటుంబసభ్యులు హాజరై విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరులు వారు పుస్తకాన్ని అంజనీ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్య, అడిషనల్ డీజీలు సౌమ్య మిశ్రా, శివధర్ రెడ్డి, సంజయ్ కుమార్ జైన్,అనీల్ కుమార్ మహేష్ భగవత్, శ్రీనివాస రెడ్డి, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ లతోపాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News