Tuesday, May 21, 2024

సిమ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి: కేంద్ర మంత్రి వైష్ణవ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోని సిమ్ కార్డు డీలర్లకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేసినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం తెలిపారు. అంతేగాక తప్పుడు కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు పెద్ద సంఖ్యలో సిమ్ కనెక్షన్లను పొందే సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ ఏడాది మే నుంచి 52 లక్షల మొబైల్ కనెక్షన్లను ప్రభుత్వం నిలిపివేసినట్లు మంత్రి తెలిపారు. 67,000 మంది సిమ్ కార్డు డీలర్లను బ్లాక్‌లిస్టులో పెట్టామని, 300 ఎఫ్‌ఐఆర్‌లు వారిపై నమోదు చేయడం జరిగిందని ఆయన వివరించారు. తప్పుడు కార్యకలాపాలకు పాల్పడినందుకు దాదాపు 66,000 అకౌంట్లను వాట్సాప్ తనకు తానుగా బ్లాక్ చేసిందని మంత్రి చెప్పారు. అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు సిమ్ కార్డు డీలర్లకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేసినట్లు ఆయన చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన డీలర్లకు రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని ఆయన చెప్పారు.

దేశంలో మొత్తం 10 లక్షల మంది సిమ్ కార్డు డీలర్లు ఉన్నారని, పోలీసు వెరిఫికేషన్ కోసం వారికి తగినంత సమయం ఇస్తామని ఆయన వివరించారు. బల్క్ కనెక్షన్ల నిబంధనను టెలికమ్యూనికేషన్స్ శాఖ నిలిపివేసిందని, దీని స్థానంలో బిజినెస్ కనెక్షన్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News