Tuesday, April 30, 2024

అంబర్‌పేట.. ఎవరి కోట?

- Advertisement -
- Advertisement -

(సాయి రమేష్/మన తెలంగాణ)
రాష్ట్ర రాజకీయాల్లో అంబర్ పేటది ప్రత్యేక స్థానం. ఇక్కడి నుండి పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులు జాతీయ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు నియోజకవర్గాల నుండి ఏర్పడిన అంబర్‌పేట చారిత్రాత్మక రాజకీయాలకు వేదికగా నిలిచింది ఇక్కడి నుండి అత్యధికంగా జి. కిషన్‌రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు శ్రీకృష్ణ యాదవ్ రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న కాలేరు వెంకటేశు 2019లో ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తున్న వి. హనుమంతరావు ఇక్కడి నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యరి.్థ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ స్థానం నుంచి పార్లమెంటు ఎన్నికలో పోటీ చేసి అంబర్‌పేట నుంచి భారీ మెజార్టీ సాధించి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.

నియోజవర్గ చరిత్ర…
2009 నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా హిమాయత్ నగర్ డివిజన్ నియోజకవర్గం నుండి విడిపోయి అంబర్‌పేట నియోజవర్గంగా ఏర్పడింది. అప్పటి ఎన్నికల్లో బిజెపి నుంచి జి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఫరుద్దీన్, బిఆర్‌ఎస్, టిడిపిల ఉమ్మడి అభ్యర్థిగా జగదీష్, పిఆర్‌పి పార్టీ నుంచి జి.శ్రీనివాస్ గౌడ్‌లో బరిలో ఉండగా కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో బిజెపి నుండి జి.కిషన్ రెడ్డి, బిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎడ్ల సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా వి. హనుమంతరావు పోటీలో ఉండగా కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా కిషన్‌రెడ్డి, బిఆర్‌ఎస్ అభ్యర్థిగా కాలేరు వెంకటేష్ పోటీ చేసి కిషన్‌రెడ్డి పై సల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా కాలేరు విజయం సాధించారు. అంబర్‌పేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,70,728 ఉన్నారు.

సంక్షేమ పథకాలే బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి…
2019లో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి చిత్తశుద్ధితో అంబర్‌పేట అభివృద్ధికి కృషి చేశానని బిఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అంటున్నారు. తన పనితీరును గుర్తించి సీఎం కేసీఆర్ తిరిగి అవకాశం కల్పించారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెబుతున్నారు. రెండోసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని గెలుపులో ఆయన ప్రధాన భూమిక పోషిస్తారని కాలేరు ధీమాతో ఉన్నారు.

ఆరు గ్యారంటీలే కాంగ్రెస్‌కు అండ…
అంబర్‌పేటలో బిజెపి, బిఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్‌ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ అభ్యర్థి సింగిరెడ్డి రోహిన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల సంక్షేమ పథకాలు ప్రతి పేదోడికి అందుతాయని, కాంగ్రెస్ పాలనలోని ప్రజలు సుఖశాంతులతో ఉంటారని అందుకే అంబర్‌పేట నియోజకవర్గంలో నా గెలుపు ఖాయమని రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
బిసి ముఖ్యమంత్రి హామీపైనే బిజెపి ఆశ
రాష్ట్రంలో బీసీలకు, దళితులకు బిజెపి పార్టీతోనే న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందని, నియోజవర్గా ప్రజలు బిజెపి వైపు ఉన్నారని బిజెపి అభ్యర్థి చిన్నబోయిన కృష్ణయాదవ్ అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News