Wednesday, May 8, 2024

మరో తొమ్మిది పార్టీలకు గుర్తుల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే మరో తొమ్మిది పార్టీలకు గుర్తులు కేటాయిస్తూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. పరివర్తన్ పార్టీ ఆఫ్ ఇండియాకు విజిల్ గుర్తు, విశ్వభారత్ పార్టీకి ఏడు కిరణాలతో ఉండే పెన్ను పాళీ, ప్రజా ఏక్తా పార్టీకి ప్రెజర్ కుక్కర్, భారత్ సమాజ్ డెవలప్ పార్టీకి వాటర్ ట్యాంకర్, భారత చైతన్య యువజన పార్టీకి చెరుకు గడ, తెలంగాణ రాజ్య సమితికి గ్యాస్ సిలిండర్, ఆబాద్ పార్టీకి సిసి కెమెరా, విద్యార్థుల రాజకీయ పార్టీకి క్రికెట్ బ్యాట్, జన శంఖారావం పార్టీకి బెండకాయ గుర్తులను కేటాయించినట్లు పేర్కొన్నారు.

సర్వీసు ఓటర్ల బ్యాలెట్ పత్రాల్లో ‘నన్ ఆఫ్ ది ఎబౌ’
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చకపోతే నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ)కు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిన విషయం విధితమే. ఈవిఎం యంత్రాలు, పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లో ‘నోటా’ అని ఉండగా, సర్వీసు ఓటర్లకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లో మాత్రం ‘నన్ ఆఫ్ ది ఎబౌ’ అని నమోదు చేయాలని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా!
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీని నిమిత్తం స్వచ్ఛంద నైతిక నియమావళి (వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్)ని రూపొందించింది. సోషల్ మీడియా సైతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోనే ఉండాలని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే కథనాలు, వాణిజ్య ప్రచారాలను సైతం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఆయా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులుగా ఉన్న అంజు చందక్, రాజేష్ కుమార్ సింగ్, అపూర్వ సింగ్‌లను నోడల్ అధికారులుగా నియమించింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు నోడల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News