Tuesday, April 30, 2024

బీహార్‌లో నేడే రెండో దశ పోలింగ్

- Advertisement -
- Advertisement -

తేజస్వీ నాయకత్వానికి పరీక్ష,  94 స్థానాలు, 1500 మంది అభ్యర్థులు

 

పాట్నా : గంగా పరివాహక ప్రాంతం, రాజకీయంగా ఉద్విగ్నభరిత రాష్ట్రం అయిన బీహార్‌లో మంగళవారం రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో మొత్తం 2.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోవిడ్ నేపథ్యంలోనే వినియోగించుకోవల్సి ఉంది. రాష్ట్రంలో ఈసారి మొత్తం మూడు విడతల పోలింగ్ జరుగుతోంది. వీటిలో రెండో దశ అత్యంత కీలకమైనది. ఈసారి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యం ఇవిఎంలలో నిక్షిప్తం కానుంది. 1500 మంది వరకూ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. నవంబర్ 3వ తేదీ నాటి పోలింగ్ మొత్తం 94 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగుతుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 243 స్థానా లు ఉన్నాయి.

17 జిల్లాలను విస్తరించుకుని ఎన్నికలు జరుగుతాయి. వీటిలో పాట్నా, భగల్పూరు, నలందా జిల్లాలు ఉత్తర గంగా పరివాహక ప్రాంతంలో ఉన్నా యి. ఈసారి పోలింగ్ దశలో ఆర్జేడీ నేత, ప్రతిపక్ష కూటమి తరఫు సిఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ కూడా ప్రముఖంగా బరిలో ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వ వ్యతిరేక పవనాల ఆసరాగా తాము విజయం సాధించి తీరుతామని తేజస్వీ ధీమా తో ఉన్నారు. లాలూ ప్రసాద్ తనయుడు అయిన తేజస్వీ వైశాలి జిల్లాలోని రాఘోపూర్ నుంచి తిరిగి ఎన్నికలలో పోటీలో నిలిచారు. గతంలో అంటే 2015 ఎన్నికలలో ఆయన బిజెపి అభ్యర్థి సతీష్‌కుమార్‌ను ఓడించారు. అంతకు ముందటి ఎన్నికలలో యాదవ్ తల్లి, మాజీ సిఎం రబ్రీదేవిని ఓడించారు. బిజెపి ఈ సారి కూడా సతీష్‌కుమార్‌పైనే విశ్వాసం ఉంచి పోటికి దింపింది. ఆయనతో ఇక్కడి నుంచి ప్రతిపక్ష దిగ్గజ యువనేతను దెబ్బతీయాలని సంకల్పించింది. ఈసారి కూడా తేజస్వీ పెద్ద సోదరుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ జిల్లా నుంచి పోటీకిదిగారు. ఇంతకు ముందటి వైశాలి జిల్లాలోని మహూవా నుంచి ఆయన ఇప్పుడు ఈ స్థానం ఎంచుకున్నారు.

ఇక్కడ ఆసక్తికరమైన పోటీ ఉంది. ఎన్‌డిఎ తరఫున ఐశ్యర్యా ట్రంప్‌కార్డుగా తేజ్‌ప్రతాప్‌ను దెబ్బతీసేందుకు పావులు కదిపారు. ఐశ్వర్యా తేజ్ ప్రతాప్ నుంచి విడాకులు పొందారు. ఎన్‌డిఎ తరఫున ఆక్కగ ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ జెడియు టికెట్‌పై పోటీ చేస్తున్నారు. తండ్రిని గెలిపించాలని కోరుతూ ఆమె చేస్తున్న ప్రచారం మాజీ భర్తకు సంకటంగా మారింది. రాజధాని పాట్నాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలలు కూడా ఈ రెండో దశలోనే పోలింగ్‌కు వెళ్లుతున్నాయి. ఈ నాలుగూ బిజెపి స్థానాలే. వీటిని దెబ్బతీసేందుకు ప్రతిపక్ష కూటమి యత్నిస్తోంది. పాట్నా సాహిబ్ స్థానాన్ని వరుసగా ఏడోసారి గెల్చుకోవడానికి రాష్ట్ర మంత్రి నంద్‌కిశోర్ యాదవ్ ఇక్కడ పోటీ పడుతున్నారు. పలువురు మంత్రులు ఈసారి ఎన్నికల పోటీలో ఉన్నారు.

రెండోదశ పోలింగ్ విశేషాలు

పలువురు బాహుబలులు, వారి భార్యలు, కుమారులు, సోదరులు కూడా పలుస్థానాలలో ఉన్నారు. మహారాజ్‌గంజ్‌లో అత్యధికంగా 27 మంది, అత్యల్పంగా దరౌలిలో కేవలం నలుగురు రంగంలో ఉన్నారు. బిజెపి వారు 46మంది, జెడియులు నుంచి 43 మంది రంగంలో ఉన్నారు. ఎన్‌డిఎలో తాజాగా చేరిన ముఖేష్ సాహ్ని పార్టీ విఐపి ఐదు స్థానాలలో అభ్యర్థులను దింపింది. ఎల్‌జెపి 52స్థానాలలో పోటీకి నిలిచింది. ఈసారి నేరుగా తండ్రి లేకుండా చిరాగ్ పాశ్వాన్ నేరుగా ఎన్నికల రంగంలోకి దిగారు. ఆయన యువనాయకత్వానికి ఈ ఎన్నికలు పరీక్షగా నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News