Monday, May 13, 2024

నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం….

- Advertisement -
- Advertisement -

Polling started in Four States

 

 

ఢిల్లీ: అసోం, బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అసోం చివరి దశ, బెంగాల్ లో మూడో దశకు ఎన్నికలు జరుగుతున్నాయి. భారత దేశంలో 475 నియోజకవర్గాలు, రెండు లోక్ సభ స్థానాకలు పోలింగ్ జరుగుతోంది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కరోనా రోగులు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. బిజెపి తరఫున పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మెట్రో మ్యాన్ శ్రీధరన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళ రాష్ట్రం నుంచి బిజెపి తరఫున సిఎం అభ్యర్థి శ్రీధరన్ ఉన్నారు. శ్రీధరన్ ముఖ్యమంత్రి అయితే పాలన అద్భుతంగా ఉంటుందని యాక్టర్ మోహన్ లాల్ పేర్కొన్నారు. తమిళనాడులోని థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని స్టెల్లా మేరిస్ పోలింగ్ బూత్‌లో ర‌జ‌నీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోయంబ‌త్తూర్ సౌత్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న క‌మ‌ల్ హాస‌న్ చెన్నై హైస్కూల్లో ఓటేశారు. ఆయన వెంట కుమార్తెలు శృతి హాస‌న్, అక్ష‌ర హాస‌న్ లు కూడా ఓటు వేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News