Friday, August 8, 2025

పేదల ముఖంలో నవ్వు చూడటమే కాంగ్రెస్ లక్ష్యం: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఏ పార్టీ కార్యకర్త అని కూడా చూడకుండా లబ్దిదారులను ఎంపిక చేశామని అన్నారు. ఏడేళ్ల క్రితం నిర్మించిన 592 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పొంగులేటి ప్రారంభించారు. హనుమకొండ బాలసముద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా పేదవాడైతే చాలు  ఇళ్లు ఇవ్వాలని అధికారులకు చెప్పామని, పేదల ముఖంలో నవ్వు చూడటమే లక్ష్యం అని తెలియజేశారు. గత ప్రభుత్వం రెండుపడకల గదులను పార్టీ కార్యకర్తలు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చిందని అన్నారు. మొదటి విడతలో 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, గత ప్రభుత్వం పదేళ్లపాటు ఎవరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.

ఈ ప్రభుత్వం 6.50 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని కొనియాడారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులో (Government ration card) భార్య పేరు, పిల్లల పేర్లు చేర్చే అవకాశం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రైతుభరోసా కింద రైతుల ఖాతాల్లో 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లను జమచేశామని పొంగులేటి చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని, రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను విచారణ కమిషన్ బయటపెట్టిందని అన్నారు. బిసిలకు రిజర్వేషన్లను పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వ చట్టం చేసిందని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను కేంద్రంలోని బిజెపి ఆమోదించలేదని పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బిజెపికి  వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News