Thursday, May 9, 2024

జనవరి 30 వరకు దరఖాస్తుల డెటా ఎంట్రీ జరుగుతుంది: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేబినెట్ సబ్ కమిటీలో విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విధివిధానాల తరువాత మంత్రి వర్గ భేటీలో చర్చిస్తామని, రేషన్ కార్డులకు సంబంధించి త్వరలో ఒక స్పష్టత ఇస్తామని వివరించారు. ప్రజాపాలన కింద దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిందని, అర్హులు ఉండే తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఎంపి ఎన్నికల దృష్టా అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారని, అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్న దరఖాస్తుల డేటా ఎంట్రీ ఆగలేదని, ప్రతి గ్రామం నుంచి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించామని, ప్రతి తండాకు అధికారులు వెళ్లి దరఖాస్తులు స్వీకరించారని, ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని పొంగులేటి ప్రశంసించారు.

అభయహస్తం హామీలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని, ఇతర అంశాలకు సంబంధించి మరో 20 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. అతి తక్కువ సమయంలో 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరించామని, 40 రోజుల్లో హామీలు ఎలా నెరవేరుస్తారని విమర్మలు చేస్తున్నారని, ఏనాడు 40 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పలేదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. యుద్ధప్రాతిపదికన దరఖాస్తుల డేటా ఎంట్రీ జరుగుతోందన్నారు. ఈ నెల 30 వరకు దరఖాస్తుల డెటా ఎంట్రీ జరుగుతోందని వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News