Monday, May 6, 2024

విచిత్రమైన పోజుతో కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

 

పూజా హెగ్డే అంటే ఇప్పుడు మామూలు హీరోయిన్ కాదు. సౌత్ ఇండస్ట్రీలో ఈ భామ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సినిమా సినిమాకు తన రేంజ్‌ని పెంచుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన క్రేజ్ ని మరింత పెంచుకుంటోంది. ఈ బుట్టబొమ్మ ఫాలోవర్స్ సంఖ్య ఏ స్థాయిలో ఉందో తెలిస్తే షాక్ కావాల్సిందే. పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి మందికి పైగా ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఇప్పుడు 11 మిలియన్స్‌కి చేరింది. ఈ సందర్భంగా పూజా హెగ్డే విచిత్రమైన పోజు ఇచ్చింది. తలక్రిందులుగా కాళ్లతో 11 అనే సంఖ్యను చూపించి నెటిజన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తనపై ఈ స్థాయిలో ప్రేమను చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలని ఈ సందర్భంగా పూజా హెగ్డే పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ భామ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రంతో పాటు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News