Sunday, April 28, 2024

కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంఎల్ఎల సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

Suspension of two MLAs from Rajasthan Congress

జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ రాజకీయాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. తాజాగా పార్టీలో ఆడియో టేపుల కలకలం రేగుతోంది. ఇద్దరు రెబల్ కాంగ్రెస్ ఎంఎల్ఎలపై వేటు పడింది. భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్ లను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆడియో టేపుల్లో బేరసారాలకు పాల్పడినట్టు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. సచిన్ పైలట్ బిజెపితో కలిసి అశోక్ గెహ్లాట్ సర్కార్ ను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ సచిన్ పైలట్ ను కాంగ్రెస్ వదులుకునేందుకు సిద్దంగా లేదని తేలుస్తోంది. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి అధిష్టానం రంగంలోకి దింపింది. అసమ్మతి కారణంగా పార్టీకి దూరమైన సచిన్ వెనక్కి తీసుకోచ్చే బాధ్యతను ప్రియాంకకు అప్పగించారు సోనియా గాంధీ. దీంతో రంగంలోకి దిగిన ఆమె పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతోంది.

Suspension of two MLAs from Rajasthan Congress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News