Wednesday, May 1, 2024

నితిన్ కు జోడీగా పూజా హెగ్డే..

- Advertisement -
- Advertisement -

లక్కీ హీరోయిన్ పూజా హెగ్డే మరో సినిమాకు సైన్ చేసింది. యంగ్ హీరో నితిన్ సరసన ఈ బ్యూటీ నటించబోతోంది. నితిన్ సొంత బ్యానర్ మీద నిర్మించే ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. ‘నా పేరు సూర్య’ తరువాత వక్కంతం దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. ‘అంధాదూన్’ రీమేక్ ‘మాస్ట్రో’ను పూర్తి చేసిన తరువాత నితిన్ చేసేది ఈ సినిమానే. పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్ సినిమా చేస్తోంది. ఇక నితిన్ హీరోయిన్ల ఎంపికలో జాగ్రత్తగా వుంటున్నాడు. రష్మిక, కీర్తి సురేష్, పూజా హెగ్డే ఇలావుంది అతని హీరోయిన్ల లైనప్. దీని తరువాత సినిమాకు కూడా ఓ క్రేజీ హీరోయిన్‌ను తీసుకోబోతున్నాడట నితిన్.

Pooja Hegde to romance with Nithin?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News