Sunday, April 28, 2024

కమల్ తో సంబంధంపై స్పందించిన నటి..

- Advertisement -
- Advertisement -

Pooja Kumar, Kamal Hassan

స్టార్ హీరో కమల్ హాసన్ ఎల్లప్పుడూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చేసే సినిమాలు ఏడాదికి ఒకటో లేదా రెండేళ్లకు ఒకటో విడుదల అవుతుంటాయి. కానీ ఆయనకు సంబంధించిన వివాదాలు మాత్రం తరచుగా వార్తలలో కనిపిస్తుంటాయి. ఇక కమల్‌హాసన్ ఎంత స్టార్ హీరోనో అంతే రొమాంటిక్ హీరో అని అంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే ఆరు పదుల వయసు నిండినా ఆయన సినిమాలలో మినిమమ్ ఘాటు సన్నివేశాలు ఉంటాయి. కానీ అలాంటి ఘాటు సన్నివేశాలే ఒక్కోసారి తంటాలు తెచ్చి పెడుతుంటాయి. ప్రస్తుతం అలాంటి తంటానే హీరోయిన్ పూజాకుమార్‌తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కమల్ హాసన్ సినీ జీవితంలో ఎంతటి స్టారో వేరే చెప్పక్కర్లేదు. ఇక అసలు విషయానికొస్తే.. కమల్ హాసన్ గతంలో పుట్టినరోజును తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఆ వేడుకలో కమల్ కుటుంబంతో పాటు హీరోయిన్ పూజా కుమార్ కూడా కనిపించింది.

అంతేకాకుండా బర్త్ డే ఏర్పాట్లన్నీ తనే స్వయంగా చేస్తున్నట్లు కనిపించింది. దీంతో మళ్లీ చర్చ మొదలైంది. పూజా కుమార్, కమల్ హాసన్ మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ అని వివాదం చెలరేగింది. ఇక వీరిద్దరి మధ్య నడుస్తున్న పుకార్లపై పూజా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. “నేను గత ఐదారేళ్లుగా కమల్ హాసన్‌తో కలిసి పని చేస్తున్నాను. ఆయన ఓ గొప్ప క్రియేటర్. ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. నిజానికి నాకు ఓపికతో ఉండటం ఎలాగో నేర్పించింది ఆయనే. నాకు కమల్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు, సోదరులు, కూతుర్లు అందరూ బాగా పరిచయం. కానీ ప్రస్తుతం వస్తున్న పుకార్లు చూస్తుంటే.. నేనేదో కమల్‌హాసన్ భార్య స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు అనుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు”అని చెప్పింది.

Pooja Kumar Respond on relationship with Kamal Haasan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News