Thursday, May 2, 2024

మాస్క్‌తో ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళ్లిన ప్రభాస్

- Advertisement -
- Advertisement -

Prabhas

 

ఓవైపు కరోనా వైరస్ అల్లకల్లోలం గురించి ఇంటా బయటా గజగజ వణికిపోతున్నారు. విమానాశ్రయాలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. రెగ్యులర్ ట్రావెలర్స్ సైతం ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. సెలబ్రిటీల్లో ఈ భయం మరీ ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో డార్లింగ్ ప్రభాస్ గట్స్ చూస్తుంటే పొగిడేయకుండా ఉండలేం. హైదరాబాద్ విమానాశ్రయంలో మాస్క్ ధరించి కనిపించిన ప్రభాస్ ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలే ఫ్రాన్స్ (యూరప్) దేశంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందన్న టాక్ ఉంది.

ఇప్పటికే ఆ దేశంలో దాదాపు 200 మందికి కరోనా వైరస్ సోకిందని తేలింది. అలాంటి చోటికి వెళ్లేందుకు ప్రభాస్ ఏమాత్రం భయపడకుండా ఇలా ధైర్యం చేయడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. కరోనా భయంతో పలు ప్రొడక్షన్ హౌస్‌లు షూటింగ్‌లు నిలిపేస్తుంటే… దేనికీ వెరవక ప్రభాస్, యు.వి.క్రియేషన్స్ బృందం ఇలా యూరప్‌లో షూటింగ్ కోసం వెళ్లడం సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. సినిమా షూటింగ్ కోసం ప్రభాస్, చిత్ర యూనిట్ సభ్యులు ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళ్లారు.

Prabhas left for France with mask
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News