Monday, May 6, 2024

చిన్నచిన్న సంతోషాలను వదులుకోవద్దు

- Advertisement -
- Advertisement -

young girl

 

ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలనుకుంటారు. ఎన్నో సవాళ్లు, అవకాశాలు, సంతోషాలు, విషాదాలు, బాధలు, బరువులు ఇవన్నీ అందరి జీవితాల్లో ఉంటాయి. జీవితపు ఆటుపోట్లను ఎదుర్కొవటంలో ఒక్కోక్కరిదీ ఒక్కో శైలి.
సంతోషం డబ్బులో ఉంటుందని చాలా మంది అపోహపడుతుంటారు. అలాగని చిన్న చిన్న సంతోషాలను అనుభవించలేక ఎప్పుడూ విచారంగా ఉంటారు.
జీవితాన్ని సంతోషమయం చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది.

చిన్న చిన్న సంతోషాలు: జీవితమంటే, ఎన్నో రకాల చిన్న సంఘటనలు, అనుభవాల మేళవింపు. అవన్నీ జీవన గమనాన్ని మారుస్తాయి. చిన్నచిన్న మార్పులపై దృష్టిపెట్టి, చిన్న చిన్న ఆనందాలను సొంతం చేసుకోవాలి.

స్నేహంతో కొత్త ఉత్సాహం: కొత్త స్నేహితులను సంపాదించటం తేలిక. కానీ సరైన స్నేహితుని సంపాదించటం కష్టం. మంచి స్నేహితులు ఆశావహదృక్పథాన్ని పెంచుతారు. దానివల్ల చింత తగ్గుతుంది. కనీసం ఐదుగురు మంచి స్నేహితులను సంపాదించుకోండి. వారు మనస్సులోని బాధను దూరం చేస్తారు.

సరదాగా ఉండేలా: మీ చుట్టూ ఎప్పుడూ సంతోషంగానూ, సరదాగా ఉండే వ్యక్తులు ఉండేట్టు చూసుకోండి. వారి సాంగత్యంలో సంతోషాన్ని సొంతం చేసుకుంటారు. పూర్వంకంటే మరింత సంతోషంగా జీవిస్తారు.

భయాలను తరిమేయండి: చాలామంది తమ భయాలను వాటంతట అవే వదిలిపోతాయన్న దృష్టితో పట్టించుకో కుండా ఉండాలని ప్రయత్నిస్తే అంతంగా అవి మన జీవితంపై పట్టు పెంచుతూ పోతాయి. అందుచేత మన భయాలను అదుపులో పెట్టుకోకపోతే మన జీవితంపై అవి పెత్తనం సాగిస్తాయి. భయాలను ఎదుర్కొని వాటిపై పట్టు సాధిస్తే జీవితం గొప్పగా మారుతుంది.

కృతజ్ఞతలు చెప్పండి: కృతజ్ఞతాభావం మనకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. జీవితంలో లభించిన మంచి విషయాలన్నింటి పట్ల మనం కృతజ్ఞతను ఏ విషయాల గురించి వ్యక్తం చేశారో, ఎవరెవరికి ధన్యవాదాలు తెలియచేశారో రాసి పెట్టుకోండి. అలా చేయటం వల్ల జీవితంలో మంచిమార్పుకు దారి ఏర్పడుతుంది. అలా రాయటం అలవాటు చేసుకున్నవారూ ఆశావహదృక్పథం తో ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తున్నట్టు తెలుస్తుస్తోంది.

ఇతరులకు సాయం: అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం వల్ల మనస్సుకు తృప్తి కలుగుతుంది. జీవితంలో ఇతరులకు సహాయం చేయటాన్ని విడదీయరాని భాగంగా చేసుకుంటే వచ్చే ప్రతిఫలం ఎంత సంతోషాన్ని ఇస్తుందో తెలుసుకోగలగాలి.
పోల్చుకోవద్దు: ఇతరులతో ఎల్లప్పుడూ పోల్చుకుంటూ ఉంటే మన జీవితంలో బాధే మిగిలిపోతుంది. ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కారు. ఆ విషయం మనందరికీ తెలుసు. లోపాలను అంగీకరించాలి.

ఆనందకరమైన సంగీతం: ప్రతిరోజు కొంత సమయాన్ని మనస్సుకు ఉల్లాసాన్ని కలిగించే సంగీతాన్ని వినడానికి వినియోగించుకోవాలి. ఆ సంగీతం వినటం వల్ల మనలో ఉత్సాహం పెరుగుతుంది. దైన్యం తగ్గి ఆశ చిగురుస్తుంది.

పెంపుడు జంతువులు: మనకు నచ్చిన కుక్కనో, పిల్లినో, చిలుకనో పెంచుకుంటే మనకు దగ్గరి బంధువులు లేదా ప్రాణస్నేహితుల వల్ల ఎటువంటి మానసిక ఆసరా లభిస్తుందో అదే ఆసరా పెంపుడు జంతువుల వల్ల కూడా లభిస్తుంది.
అలా ఏదో ఒక ప్రాణిని పెంచేవారు, పెంచని వారితో పోలిస్తే ఆనందంగా ఉంటున్నారు. వారిలో కుంగుబాటు తక్కువని పరిశోధకులు కూడా గుర్తించారు.

Dont give up on the little joys
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News