Wednesday, May 15, 2024

సిఎం రేవంత్‌ రెడ్డితో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ. పాల్ సమావేశం

- Advertisement -
- Advertisement -

జనవరి 30వ తేదీన జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు రావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం
గ్లోబల్ పీస్ సదస్సుకు కావాల్సిన అనుమతులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి కెఏ పాల్ విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్‌రెడ్డితో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ సమావేశమయ్యారు. జనవరి 30వ తేదీన జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. దానికి సిఎం అనుకూలంగా స్పందించినట్లు కెఏ పాల్ తెలిపారు. గ్లోబల్ పీస్ సదస్సుకు కావాల్సిన అనుమతులను సైతం మంజూరు చేయాల్సిందిగా కేఏ పాల్ సిఎం రేవంత్‌ను కోరారు. దీనికి కూడా సిఎం సానుకూలంగా స్పందించారు. పుష్పగుచ్ఛాలను ఇచ్చి సిఎం రేవంత్‌కు కెఏ పాల్ క్రిస్మస్ విషెస్ తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కెఏ పాల్ కలుసుకోవడం ఇదే తొలిసారి. అనంతరం ఈ విషయాన్ని కెఏ పాల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సదస్సుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు పలు దేశాల నుంచి వేల మంది ప్రతినిధులు హాజరవ్వనున్నట్లు పాల్ వెల్లడించారు.
క్రైస్తవ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు…
రాష్ట్రంలో క్రైస్తవ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న కొన్ని అంశాలను రేవంత్ రెడ్డి దృష్టికి కెఏ పాల్ తీసుకెళ్లినట్లు సమాచారం. జనాభా నిష్పత్తి ప్రాదిపదికన క్రైస్తవులకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని కెఏ పాల్ రేవంత్‌కు సూచించినట్లుగా తెలిసింది. దీని ఆధారంగా వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లను క్రైస్తవ సామాజిక వర్గానికి కేటాయించాలని పాల్ విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం. దళితులను ఓటు బ్యాంకుగా చూడకుండా వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కెఏ పాల్ సిఎం రేవంత్‌ను కోరినట్లుగా తెలిసింది.
దళిత బంధు పథకాన్ని సమర్థవంతంగా…
దళితబంధు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, మరింత మందిని లబ్ధిదారులుగా చేర్చాలని కెఏ పాల్ సిఎం రేవంత్‌ను కోరినట్లుగా సమాచారం. ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా దళితబంధు పథకాన్ని అమలు చేయడంతో పాటు క్రైస్తవుల సంక్షేమంపై దృష్టి సారించాలని పాల్ కోరినట్లు తెలిసింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంటూ వస్తున్న కొన్ని డిమాండ్లను కెఏ పాల్ సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News