Friday, April 26, 2024

‘మా’ అధ్యక్ష పదవికి నామినేష‌న్ వేసిన ప్రకాశ్ రాజ్..

- Advertisement -
- Advertisement -

Prakash Raj filed nomination at MAA Office

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నేపథ్యంలో ప్ర‌కాశ్ రాజ్ అధ్యక్షపదవికి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. సోమవారం త‌న ప్యానెల్ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లి ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో ఓటు హక్కుతో నిర్ణయిస్తారన్నారు. గెలిచినా, ఓడినా ‘మా’ కోసం పని చేస్తామని జీవిత రాజశేఖర్ అన్నారు. ఈరోజు మధ్యాహ్నం సీవీఎల్‌ నర్సింహారావు అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మంచు విష్ణు రేపు మధ్యాహ్నం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ రోజు నుంచి ఈనెల 29వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబ‌ర్ 10న మా ఎన్నికలు జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే.

Prakash Raj filed nomination at MAA Office

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News