Friday, May 3, 2024

ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి విరాళం..

- Advertisement -
- Advertisement -

Prashant Bhushan paid Rs 1 Fine to Supreme Court

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. అయితే, ధర్మాసనం తీర్పు ఇచ్చిన అనంతరం తన సహచర సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్ తనకు జరిమానా రూపాయిని విరాళంగా ఇచ్చినట్లు ప్ర‌శాంత్ భూష‌ణ్ ట్వీట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీంతో ఈ రూపాయిని జరిమానాగా ప్ర‌శాంత్ భూష‌ణ్ చెల్లించేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. కాగా, చీఫ్ జ‌స్టిస్ ఎస్ఎ బోబ్డేతో పాటు సుప్రీం న్యాయ‌మూర్తుల‌ను ప్రశాంత్ భూషణ్ విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో ప్రశాంత్ భూషణ్ క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆయన్ను ఆదేశించింది. అయితే, క్షమాపణలు చెప్పేందుకు ప్రశాంత్ భూషణ్ నిరాకరించారు. దీంతో ఆయనకు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సెప్టెంబరు 15వ తేదీలోగా జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు మూడు నెలల పాటు న్యాయవాద వృత్తి నుంచి సస్పెండ్ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రూపాయి జరిమానా చెల్లించి ఈ వివాదానికి ముగింపు పలకాలని ప్రశాంత్ భూషణ్‌కు ఆయన సన్నిహితులు సూచించినట్లు తెలుస్తోంది.

Prashant Bhushan will pay Rs 1 Fine to Supreme Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News