Friday, May 3, 2024

200 సీట్లు రాకపోతే పదవులు వదులుకుంటారా: ప్రశాంత్ కిషోర్ సవాల్

- Advertisement -
- Advertisement -

                        200 సీట్లు రాకపోతే పదవులు వదులుకుంటారా
                            బిజెపి నేతలకు ప్రశాంత్ కిషోర్ సవాల్

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 స్థానాలను గెలుచుకోని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేస్తామని బహిరంగ ప్రకటన చేస్తారా అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం బిజెపి నాయకులకు సవాలు విసిరారు. వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి రెండు అంకెల స్థానాలను దాటలేదని సోమవారం జోస్యం చెప్పిన ప్రశాంత్ కిషోర్ తన వ్యాఖ్యలను మంగళవారం పునరుద్ఘాటించారు. బిజెపికి 100 సీట్ల కన్నా లోపే వస్తాయని, అలా దాటితే తాను చేస్తున్న పని మానేస్తానని ఆయన స్పష్టం చేశారు. 2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన నరేంద్ర మోడీ తరఫున విజయవంతంగా ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన ప్రశాంత్ కిషోర్ వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయావకాశాలను మెరుగుపరుచుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచార వ్యూహకర్తగా నియమించుకున్నారు.
ఇలా ఉండగా..ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశం ఒక ఎన్నికల వ్యూహకర్తను కోల్పోనున్నదంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బెంగాల్‌లో ప్రస్తుతం ఏర్పడిన బిజెపి సునామీ దృష్టా వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని, దేశం ఒక ఎన్నికల వ్యూహకర్తను కోల్పోనున్నదని ఆయన ట్వీట్ చేశారు.

Prashant Kishor throws challenge to BJP Leaders

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News