Monday, April 29, 2024

కొత్త రకం కరోనా అదుపునకు అదే మార్గం : డబ్ల్యూహెచ్‌ఒ

- Advertisement -
- Advertisement -

World Health Organization key comments on strain coronavirus

 

వాషింగ్టన్ : బ్రిటన్‌లో వెలుగు లోకి వచ్చి మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు ఈ కొత్తరకం కరోనా వ్యాప్తి అదుపు తప్పలేదని స్పష్టం చేసింది. మొదటి నుంచి కరోనా నియంత్రణకు ఏ విధానాలు అనుసరిస్తున్నామో అవే పాటిస్తే నియంత్రించ వచ్చని వివరించింది. గతంలో ఇంతకంటే బారీ స్థాయి విజృంభణను చూశామని, దానితో పోలిస్తే దీని వ్యాప్తి అదుపు తప్పలేదని చెప్పవచ్చని అభిప్రాయ పడింది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉంటూ కరోనా నిబంధనలను దీర్ఘకాలం పాటించాలని సూచించింది. కొన్ని విషయాల్లో మరింత కఠినంగా ఉండాల్సిన అవసరమూ ఉందని డబ్ల్యూహెచ్‌ఒ అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైఖేల్ ర్యాన్ అభిప్రాయ పడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News