Monday, April 29, 2024

ఐదు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన చైనా

- Advertisement -
- Advertisement -

China successfully launches five satellites into orbit

 

బీజింగ్: తాము ప్రయోగించిన లాంగ్‌మార్చ్8 రాకెట్ ఐదు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టిందని చైనా అంతరిక్ష సంస్థ సిఎన్‌ఎస్‌ఎ తెలిపింది. మంగళవారం హాయినాన్‌లోని వాన్‌చాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. రోదసీ శాస్త్రంలో పరిశోధనల కోసం వీటిని ప్రయోగించినట్టు సిఎన్‌ఎస్‌ఎ తెలిపింది. మైక్రోవేవ్ ఇమేజింగ్, రిమోట్ సెన్సింగ్, సమాచార సాంకేతికతలపై పరిశోధనలు చేయనున్నట్టు పేర్కొన్నది. రాకెట్ బరువు 356 టన్నులు కాగా, ఉపగ్రహాల బరువు 4.5 టన్నులు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News