Thursday, May 16, 2024

తెలంగాణా ఏవియేషన్ అకాడమీకి ప్రతిష్టాత్మక ఏరో క్లబ్ ఇండియా అవార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణా ఏవియేషన్ అకాడమీ కి ప్రతిష్టాత్మక ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా అవార్డు రావడంపట్ల అకాడమీ సి.ఈ.ఓ కాప్టెన్ ఎస్.ఎన్.రెడ్డి ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం తెలంగాణా ఏవియేషన్ అకాడమీ కి ఐదుసార్లు ఈ అవార్డు దక్కడం గొప్పవిషయమని సి.ఎస్ అన్నారు. దేశంలోని 21 ఫ్లేయింగ్ అకాడమీలలో పైలెట్ల శిక్షణ, డ్రోన్ పైలెట్ ట్రేనింగ్, ఏవియేషన్ ఇంజనీరింగ్ శిక్షణ లో మెరుగైన ఫలితాలను సాధించినందుకు తెలంగాణా ఏవియేషన్ అకాడమీ కి ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా అవార్డు లభించింది.

ఈ అవార్డు లభించిన సందర్బంగా అకాడమీ సి.ఈ.ఓ కెప్టెన్ ఎస్.ఎన్. రెడ్డి నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ అకాడమీ లో ప్రస్తుతం 70 మంది పైలెట్ శిక్షణ పొందుతున్నారని, మరో 230 మంది విద్యార్థులు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ లోనూ, 60 మంది డ్రోన్ పైలెట్ లుగా శిక్షణ పొందుతున్నారని వివరించారు. దేశంలోని మొత్తం సివిల్ ఏవియేషన్ శిక్షణా సంస్థల్లో ఉత్తమ శిక్షణ అందిస్తున్నందుకు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఐదు సార్లు ఈ ప్రతిష్టాత్మక ఏరో క్లబ్ అఫ్ ఇండియా ట్రోఫీ ని పొందామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News