Tuesday, May 7, 2024

పియుసి సభ్యులుగా ఎంపి సంతోష్ కుమార్

- Advertisement -
- Advertisement -

mp-santhosh-kumar

 

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపు చేసి కేంద్రానికి నివేదికలు ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వరంగ సంస్థల పనితీరును మెరుగు పర్చేందుకు మార్గదర్శకంగా నిలిచే ఈ కమిటీ 1964 నుంచి విధులునిర్వహిస్తోంది. లోక్‌సభ నుంచి 15 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులు మొత్తం 22 మంది సభ్యులు కమిటీకి ప్రాతినిథ్యం వహిస్తారు. ప్రాధాన్యత ఓటు ఆధారంగా రెండు సభలకు చెందిన సభ్యులను ఎన్నుకుంటారు. ఈ కమిటీకి ఛైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తారు.

దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలను అధ్యయనం చేయడం, వాటి ఖాతాలను పరిశీలించడంతో పాటు మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కాగ్( కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్) ఇచ్చే నివేదికలను కూడా పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ అధ్యయనం చేస్తుంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల వార్షిక నివేదికలను ప్రతి సంవత్సరం పార్లమెంట్ ముందు ఉంచేవిధంగా కమిటీ పర్యవేక్షిస్తుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన పార్లమెంటరీ కమిటీకి తాను ఎంపిక కావడంపై ఎంపి సంతోష్‌కుమార్ సంతృప్తిని వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా తన బాధ్యత మరింత పెరిగిందని, ప్రభుత్వ రంగ సంస్థలు మరింత మెరుగ్గా పని చేసేందుకు వీలుగా తమకమిటీ అధ్యయనం చేస్తుందని సంతోష్‌కుమార్ చెప్పారు.

prestigious post to Santoshkumar
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News