Sunday, April 28, 2024

వంట నూనెలు దిగొస్తున్నాయ్

- Advertisement -
- Advertisement -

Prices of cooking oils are declining

కస్టమ్స్ సుంకాల తగ్గింపుతో ధరలు తగ్గుముఖం
మార్కెట్‌లో పల్లి నూనె లీటరు రూ.160
అదేబాటలో పొద్దుతిరుగుడు, పామాయిల్ ధరలు
నెయ్యి రేటు సుమారు రూ.40 తగ్గుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : సల సల కాగుతూ వచ్చిన వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. వేరుశనగ, పొద్దు తిరుగుడు, పామాయిల్ తదితర రకాల వంటనూనెలు అందుబాటులోకి వస్తుండటంతో వినియోగదారులు ఊరట చెందుతున్నారు. బుధవారం మార్కెట్‌లో వేరుశనగ నూన లీటరు రూ.160కి తగ్గింది.పొద్దుతిరుగుడు నూనె ధర కూడా ఇదేబాటలో తిరోగమనం పట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి విజయ బ్రాండ్ పేరుతో ఉత్పత్తి అవుతున్న వేరుశనగ నూనె మరింత తగ్గి రూ.145కు చేరింది. నువ్వుల నూనె రూ.280, కొబ్బరి నూనె రూ.280, ఆమదం రూ.220కితగ్గాయి.

పామాయిల్ లీటర్ రూ.135నుంచి రూ. 12ంకి తగ్గింది. సూపర్ మార్కెట్లలో సైతం వంటనూనెల ధరలు తగ్గించి విక్రయిస్తున్నారు. విజయ బ్రాండ్ రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూన 5లీటర్ల టిన్ ధర రూ.848వుండగా, పార్చున్, ప్రీడం రకాల పొద్దుతిరుగుడు నూనె 5లీ. రూ.714కు తగ్గించారు. ఆవు నెయ్యి ధరలు కూడ తగ్గుముఖం పడుతున్నాయి. లీటర్ ఆయు నెయ్యి రూ.429 వుండగా, అముల్ బ్రాండ్ నెయ్యి ధర రూ.470కి చేరింది. రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నట్టు నూనెల టోకు వ్యాపార వర్గాలు వెల్లడించాయి.

12.3శాతానికి తగ్గిన కష్టమ్స్ సుంకాలు:

వంట నూనెల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరింత ఊరటనిచ్చే నిర్ణయం తీసుకొంది. పామాయిల్‌పై విధించే ప్రాధమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని 47.5శాతం నుంచి 12.3శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ గెజిట్ నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ కస్టమ్స్ సుంకం తగ్గింపు 2022 మార్చి వరకు వర్తిస్తుందని సిబిసిఐసి తెలిపింది. శుద్దిచేసిన పామాయిల్‌పై విధించే ప్రాధమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని వచ్చే ఏడాది మార్చి 31వరకూ 17.5శాతం నుంచి 12.3శాతానికి తగ్గించనున్నట్టు పేర్కొంది. పామాయిల్ కొత్తరేట్లను అమల్లోకి తెస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ మధ్యకాలంలో రూ.1.17 లక్షల కోట్ల విలువైన వంటనూనెలను దేశంలోకి దిగుమతి చేసుకున్నట్టు కేంద్రం తెలిపింది.

ఆయిల్ పామ్ సాగుకు రూ.11వేలకోట్లతో ప్యాకేజి

వంటనూనెల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభు త్వం శుద్ది చేసిన ముడి వంట నూనెలపై దిగుమతి సుం కాలను ఈ ఏడాది అనేక సార్లు తగ్గించింది. వంటనూనెల ధరల తగ్గింపుపై దృష్టి సారించిన కేంద్రం ఆయిల్‌పామ్ సాగును దేశీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంది. పెద్దఎత్తున ఈ పంట సాగుదిశగా రైతులను ప్రో త్సహించాలని నిర్ణయించింది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే ఉత్పత్తి పెంచడం ద్వారా ధరలు అదుపులో పెట్టడంతోపాటు, రైతులకు చేయూత నిచ్చే లా రూ.11 వేల కొట్లతో ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించింది. ఈ ప్యాకేజి అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News