Tuesday, May 7, 2024

‘అమరదీపం’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణం: ఎంపి సంతోష్ ట్వీట్….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ కలను సాకారం చేయడానికి ప్రాణాలను త్యాగం చేసిన వారి స్మారకంగా ప్రారంభించిన అమరదీపం కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడం తనకెంతో గర్వకారణంగా ఉందని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ సర్వస్వాన్ని త్యాగం చేసి సాధించుకున్న తీరును స్మరించుకుంటూ అమరవీరుల స్మారక స్థూపం, ’తెలంగాణ అమరుల స్మారకం- ‘అమరదీపం’ ను సిఎం కెసిఆర్ గురువారం ప్రారంభించారు. తెలంగాణ సెక్రటేరి యట్ దగ్గర ఈ అమరవీరుల స్మారక స్థూపం ద్వారా తెలంగాణ కోసం త్యాగం చేసిన వారి త్యాగాల చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని అభివర్ణించారు.

ఈ స్మారక చిహ్నాన్ని సందర్శించడం ద్వారా రాబోయే తరాలకు వారి గురించి తెలియనుందన్నారు. అదే విధంగా అమరుల త్యాగాలు స్మరించుకుంటూ వారికి కొవ్వొత్తుల వెలుగులతో వారికి ఘన నివాళులర్పించామన్నారు. అమరుల నివాళి గీతంతో నివాళి తెలియ జేశామన్నారు. సభలో పది వేల మంది కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పించడం జరిగిందన్నారు. ఇంతటి అద్భుత ఘట్టానికి సంబంధించిన కార్యక్రమ విశేషాలను పొందుపరుస్తూ చేసిన వీడియోను ఎంపి సంతోష్ తన ట్విట్టర్‌లో జత చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News