Sunday, May 5, 2024

విమర్శలకు బదులు ఆరోపణలే

- Advertisement -
- Advertisement -

Prime Minister Modi outrage on oppositions

ప్రతిపక్షాలది రాజకీయ దగుల్బాజీతనం : నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : దేశంలోని ప్రతిపక్షం మేధోపరమైన డోలాయమాన స్థితి, నిజాలు చెప్పలేని దుస్థితిలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలపై సమగ్ర విమర్శలకు ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది. అయితే ఇప్పుడు విమర్శకులు అనేవారు లేకుండా పొయ్యారు. కేవలం అన్నింటికీ ఆరోపణలకు దిగడమే తమ నైజంగా మల్చుకున్నారని ప్రధాని ఘాటుగా స్పందించారు. ఓపెన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ప్రధాని మోడీ ఇంతకు ముందెన్నడూ స్పందించని స్థాయిలో ప్రతిపక్షాల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపక్షాలలో విమర్శకులు లేరు. అంతా ఆరోపణలకు దిగేవారే అని, ఈ దశలో నిర్మాణాత్మకకు వీలేర్పడుతుందా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని విధానాల పరంగా ప్రతిపక్షాలు విమర్శించలేకపొతున్నాయి. ఈ క్రమంలో వారిలో ఉన్న ఆలోచనా మేధోపరమైన నిజాయితీలేమి, అంతకు మించిన రాజకీయ దగూల్బాజీతనం కన్పిస్తోందని స్పందించారు.

దేశ పౌరులు దశాబ్దాల కిందటే అందుకోవల్సిన పలు ప్రయోజనాలు ఇన్నేళ్లుగా అందని ద్రాక్షపండ్లుగా మారాయి. వీటిని వారికి అందించేందుకు ఇప్పటివరకూ జనులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు కటుతరమైన , భారీ స్థాయి నిర్ణయాలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకునే పలు నిర్ణయాలపై ప్రతిపక్షాల విమర్శల గురించి ప్రధాని ఘాటుగా స్పందించారు. నూతన వ్యవసాయ చట్టాలు, జిఎస్‌టి అమలు, ఆధార్, కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం వంటి పలు అంశాలపై ప్రతిపక్షాలు కేవలం ఆరోపణలకు దిగడమే పనిగా పెట్టుకున్నట్లుగా కన్పిస్తోందని, ఈ క్రమంలో వారి నుంచి ఎటువంటి నిర్మాణాత్మక స్పందన లేదని కేవలం దాడికి దిగాలనే ఆదుర్దా ఉంటోందని విశ్లేషించారు. వారు కాలాన్ని వెనకకు తీసుకుని పొయ్యే బాపతుగా (యు టర్న్) మాట్లాడుతున్నారు. కేవలం రాజకీయ ఉద్ధేశాలతోనే సంకుచితంగా మాట్లాడుతున్నారని మోడీ చెప్పారు. విద్వేషప్రచారం ప్రధానంగా చేసుకున్న ప్రతిపక్షం ఇంతకు ముందు తాము చేసిన వాగ్దానాలను, వాదనలను పక్కకు పెట్టి ఇప్పటి ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకుందని అన్నారు.

స్వావలంబనతోనే కీలక విజయం

స్వావలంబన కీలకమైన ఆత్మనిర్భర్‌తో దేశానికి మేలు జరిగిందని, మనదేశం టీకాలు అభివృద్ధి చేయకుండా ఉంటే అత్యధిక జనాభా గల ఈ దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించుకోండని ప్రధాని తెలిపారు. టీకాల ఉత్పత్తి ఆత్మనిర్భర్‌లో భాగంగానే జరిగింది. తరువాత వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచంలోనే మనం ముందు ఉన్నామని, అయితే ప్రతిదానిని తప్పుపట్టడం ఏ విధానం అన్పించుకుంటుందని ప్రశ్నించారు. విమర్శకులకు అంటే గౌరవం అని, వారిపట్ల సదభిప్రాయంతోనే ఉంటానని, అయితే తనకు ఎక్కడా విమర్శకులు కన్పించడం లేదన్నారు. వ్యవసాయ సంస్కరణల గురించి ఇప్పుడు విమర్శిస్తున్న వారు కొత్త వ్యవసాయ చట్టాలను తప్పుపడుతున్నారు. మరి వారు ఎన్నికల ప్రణాళికలలో తాము అధికారంలోకి వస్తే సంస్కరణలు చేపడుతామని గొప్పగా తెలిపారు. వేరేరాజకీయ పార్టీకి ప్రజల ఆశీస్సులు, మద్దతు అంది అధికారంలోకి వచ్చినందున ఈ విధంగా పనిగట్టుకుని నిందలకు దిగడం పద్ధతి చేసుకున్నట్లుగా ఉందని ప్రధాని చెప్పారు. వారు సంకల్పించిన సంస్కరణల వంటివే ఇప్పుడు తాము అమలుకు పెడితే వాటిని వద్దంటున్నారు.

ఇది ఎంతటి అస్థిరత్వం,అ ంతకు మించిన అరాచకం అనుకోవల్సి ఉంటుందని విమర్శించారు. ఈ విధమైన యూటర్న్‌లను ఏమనుకుంటారని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారి తెలివితక్కువ తనం, కన్పిస్తోంది. రైతులకు దక్కే ప్రయోజనాలను పక్కకు పెట్టి వీరు కేవలం రాజకీయంగా తమకు కలిగే ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. చిన్నసన్నకారు రైతాంగానికి మేలు చేసేందుకు వారి సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉంటుందని తేల్చిచెప్పారు. వ్యవసాయ చట్టాలే కాకుండా జిఎస్‌టి, ఆధార్ ఇతర అంశాల్లోనూ ప్రతిపక్షం వైఖరి కేవలం రాజకీయ సంకుచితకు తార్కాణంగా నిలుస్తోందని తెలిపారు. అభిప్రాయ భేదాలు ఉంటే ఎటువంటి అంశాలపై అయినా సవ్యంగా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తాము పలు సార్లు చెప్పామని, అయితే ప్రతిపక్షం ఇందుకు ముందుకు రాకపోవడం కేవలం ఆరోపణలతోనే కాలం వెళ్లదీయడం వారి నిర్మాణాత్మక శూ న్యతను తెలియచేస్తోందని తెలిపారు. తాము తీసుకువచ్చిన పలు పథకాలను దేశ రాజకీయ వర్గం కేవలం రాజ్ శక్తి ( ప్రభుత్వ నిర్ణయాల బలం) పరిధిలో చూడటం జరుగుతుంది.

అయితే తాను వీటిని కేవలం జనశక్తి కోణంలోనే పరిగణనలోకి తీసుకుంటామని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సముచితం అయినప్పటికీ వీటిని వేరే కోణంలో చూడటం ఏ విధమైన ఆలోచనా ధోరణి అవుతుంది? నిర్మాణాత్మకం అన్పించుకుంటుం దా? ప్రజాహితమా కాదా? అనేది విశ్లేషించుకుని తప్పయితే సరైన రీతిలో చేసే విమర్శకులకు తాను ఎప్పుడూ తలవంచుతామని మోడీ స్పష్టం చేశారు. అయితే తప్పులెన్నడం ఇందులోనూ ఎంతో తప్పుతో వ్యవహరించడంతో చేసే వ్యాఖ్యలకు విమర్శల పరిధి వస్తుందా? అని మోడీ ప్రశ్నించారు. రాజకీయ కుయుక్తులలో భాగంగా ప్రజా హితాన్ని తప్పుపట్టడం వల్ల రాజకీయ పక్షాలకు మేలు జరుగుతుందా? వారికి మేలు జరిగినా జరగకపోయినా ప్రజలకు కీడు జరుగుతుందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News