Sunday, April 28, 2024

16 నుంచి మూడు రోజులు రాష్ట్రంలో మోడీ పర్యటన

- Advertisement -
- Advertisement -

మూడు జిల్లాలో భారీ బహిరంగ సభలకు బిజెపి ఏర్పాట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంటు స్ధానాల్లో విజయం సాధించేందుకు కమలనాథులు ఎన్నికల ప్రచారానికి నడుం బిగించారు. అందులో భాగంగా ఆపార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 15వ తేదీ నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఈ నెల 16,17,18వ తేదీల్లో మోడీ పర్యటించే అవకాశాలు ఉన్నట్లు మూడు బహిరంగ సభల్లో పాల్గొనేలా పార్టీ వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరిలో సభలు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. మూడు లోక్‌సభ స్థానాలు సమన్వయం చేసేలా ఒక్కో సభ పెట్టాలని పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నెల 4,5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన పర్యటన కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఎన్నికల షెడ్యూల్ తరువాత పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానుంది. ఏయే తేదీల్లో పర్యటించాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. మోడీ మూడు రోజుల పర్యటనల్లో భాగంగా చివరి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ల పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడంపై కాషాయ పెద్దలు దృష్టి సారించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News